వంటగ్యాస్ ధరల పెరుగుదలకు(LPG News Today) సంబంధించి కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శలు గుప్పించారు. కేంద్రం వైఖరి కారణంగా లక్షలాది కుటుంబాలు అభివృద్ధికి మైళ్ల దూరంలో ఉన్నాయని, ప్రజలు కట్టెలపొయ్యికి పరిమితం కావాల్సి వస్తోందని విమర్శించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నఅభివృద్ధి వాహనం.. రివర్స్‌గేర్‌లో నడుస్తోంది. బ్రేకులు సైతం విఫలమయ్యాయి."
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
ధరల పెరుగుదల కారణంగా మారుమూల ప్రాంతాల్లోని 42 శాతం మంది ప్రజలు గ్యాస్ వినియోగాన్ని ఆపివేశారన్న ఓ సర్వేను రాహుల్ తన ట్వీట్‌కు జతచేశారు.
ఇదీ చూడండి: పేలిన గ్యాస్ సిలిండర్- ఏడుగురికి తీవ్ర గాయాలు