ETV Bharat / bharat

ఫోన్​ హ్యాకింగ్​ జాబితాలో రాహుల్​, ప్రశాంత్​ కిశోర్​!

దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న హ్యాకింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్న ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ టార్గెట్‌ జాబితాలోఉన్నట్టు ది వైర్‌ తాజాగా మరో కథనంలో వెల్లడించింది.

Rahul, Prasnath Kishor
రాహుల్ ప్రశాంత్ కిశోర్​
author img

By

Published : Jul 19, 2021, 8:23 PM IST

Updated : Jul 19, 2021, 10:48 PM IST

పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయలున్నట్లు వెల్లడించిన ది వైర్‌ వార్తా సంస్థ.. తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. ఆ జాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ టార్గెట్‌ జాబితాలో ఉన్నట్టు ది వైర్‌ తాజాగా మరో కథనంలో వెల్లడించింది. రాహుల్‌ గాంధీ ఉపయోగించిన కనీసం రెండు ఫోన్‌ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. రాహుల్‌కు అత్యంత సన్నిహితులైన ఐదుగురి ఫోన్‌ నంబర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది. అయితే 2018-19లో రాహుల్‌ ఉపయోగించిన ఫోన్లు ఇప్పుడు ఆయన వద్ద లేవు. దీంతో ఆ ఫోన్లను ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషించలేదు. అలాంటప్పుడు రాహుల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా? లేదా? అన్నదాన్ని స్పష్టంగా చెప్పలేమని సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది. అయితే రాహుల్‌ సర్కిల్‌లో ఉన్న కనీసం 9 నంబర్లు లక్షిత జాబితాలో ఉన్నట్లు తెలిపింది.

ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్‌ను పెగాసస్‌తో హ్యాక్‌ చేసి ఉంటారని సదరు సంస్థ మరో కథనం రాసుకొచ్చింది. పీకే ఫోన్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించగా.. కనీసం ఒకసారి హ్యాక్‌ అయి ఉంటుందని గుర్తించినట్లు సమాచారం. ఆయనతో పాటు బంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, పీకే సన్నిహితుల ఫోన్‌ నంబర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ది వైర్‌ కథనం తెలిపింది. పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నవే అని కేంద్ర ఐటీశాఖ మంత్రి లోక్‌సభలో తెలిపారు. ఇది జరిగిన కొద్ది గంటలకే ఆయన పేరు కూడా లక్షిత జాబితాలో ఉన్నట్లు రావడం గమనార్హం.

పలుమార్లు మొబైల్​ మార్చినా..

ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ పెగాసస్‌ బారిన పడిన భారతీయ ప్రముఖుల జాబితాలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేరు కూడా ఉంది. ఈ అంశంపై ఆయన స్పందించారు. తన మొబైల్‌ ఫోన్‌ పలుమార్లు మార్చినా హ్యాకింగ్‌ మాత్రం కొనసాగుతూనే ఉందని ప్రశాంత్‌ పేర్కొన్నారు. తన మొబైల్‌ ఫోన్‌ను ఇప్పటికే 5 సార్లు మార్చానని.. అయినా తాను హ్యాకింగ్‌ బారిన పడటం కొనసాగుతూనే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం ఈ నెల 14న ఆయన ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం ఆయన ఎక్కువగా భాజపా వ్యతిరేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంట్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ చేతిలో భాజపా ఓటమి చవిచూడటంలోనూ ఆయనదే కీలక పాత్ర.

ఇదీ చూడండి: 'ఫోన్ల ట్యాపింగ్​'పై మాటల యుద్ధం

Last Updated : Jul 19, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.