ETV Bharat / bharat

'పంజరంలో బందీగా మారిన 'కాగ్'' - rahul gandhi criticism on cag reports

నివేదికలు అందించడంలో 'కాగ్​' చేస్తున్న జాప్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కాగ్​ నివేదికలను రూపొందించేందుకు తీసుకున్న సమయంపై వివరాలను ట్వీట్​లో పేర్కొన్నారు.

rahul
కాగ్​ నివేదికలపై రాహుల్ విమర్శ
author img

By

Published : Mar 11, 2021, 5:41 AM IST

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​(కాగ్)పై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. గత కొన్నేళ్లగా కాగ్​ నివేదికలు అందించడంలో జాప్యం జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. 'కాగ్'.. పంజరంలో బందీ(కేజ్డ్)గా మారిపోయిందని అన్నారు.

కాగ్ నివేదికల్లో జాప్యానికి సంబంధించిన వివరాలను ట్విట్టర్​లో పంచుకున్నారు రాహుల్. 2011-12 ఆర్థిక సంవత్సరం మొదలుకొని ఇప్పటివరకు కాగ్​ నివేదికలను రూపొందించేందుకు తీసుకున్న సమయాన్ని అందులో పేర్కొన్నారు.

rahul gandhi
కాగ్​ నివేదికలపై రాహుల్ విమర్శ

2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ​నివేదికలు అందించేందుకు కాగ్ ఆ ఆర్థిక ఏడాది పూర్తయిన తర్వాత 12-18 నెలల నుంచి 18-24 నెలల సమయం తీసుకుందని రాహుల్ పేర్కొన్నారు. మరికొన్ని ఇప్పటికీ పెండింగ్​లో ఉన్నాయని అన్నారు. అయితే ట్విట్టర్​లో షేర్ చేసిన వివరాలకు సంబంధించి రాహుల్ ఎలాంటి ఆధారాలు చెప్పలేదు.

కాగా, గత ఐదేళ్లలో కాగ్​ అందించే నివేదికల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఓ మీడియా సంస్థ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర విభాగాలపై కాగ్​ రూపొందించిన నివేదికలు 2015లో 55 ఉండగా, 2020లో ఆ సంఖ్య కేవలం 14కే పరిమితమైందని తెలిపింది. సుమారు 75 శాతం మేర నివేదికలు తగ్గిపోయాయని వెల్లడించింది.

ఇదీ చదవండి : మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.