Rahul Gandhi On Modi : కుల గణనను నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణన లేకుండా ఓబీసీలకు తగిన భాగస్వామ్యం కల్పించడం సాధ్యం కాదని అన్నారు. ప్రధాని 24 గంటలూ ఓబీసీల గురించి.. వారిని గౌరవించడం గురించి మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు కుల గణనకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తాను కులగణన అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తినప్పుడు.. బీజేపీ ఎంపీలు తన గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
"ఎవరికైనా గాయం అయినప్పుడు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. వారికి ఫ్రాక్చర్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్స్-రే తీయించుకోమని అడుగుతారు. అదేవిధంగా, కుల గణన కూడా ఒక ఎక్స్-రే లాంటిదే. ఇది దేశంలో ఎవరెవరు ఉన్నారు. దేశంలో ఎంత మంది మహిళలు, OBC, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
-
VIDEO | “When one gets hurt, they are taken to the hospital and asked to go through an X-ray to know if there is a fracture. Similarly, caste census is also an X-ray, which will help us know who all are there in the country, how many women, OBC, Dalits, tribals, and minority… pic.twitter.com/EIrdKOH9DZ
— Press Trust of India (@PTI_News) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | “When one gets hurt, they are taken to the hospital and asked to go through an X-ray to know if there is a fracture. Similarly, caste census is also an X-ray, which will help us know who all are there in the country, how many women, OBC, Dalits, tribals, and minority… pic.twitter.com/EIrdKOH9DZ
— Press Trust of India (@PTI_News) September 23, 2023VIDEO | “When one gets hurt, they are taken to the hospital and asked to go through an X-ray to know if there is a fracture. Similarly, caste census is also an X-ray, which will help us know who all are there in the country, how many women, OBC, Dalits, tribals, and minority… pic.twitter.com/EIrdKOH9DZ
— Press Trust of India (@PTI_News) September 23, 2023
బీజేపీ- కాంగ్రెస్ మధ్య సిద్ధాంతాల విషయంలో పోరు జరుగుతోందని జైపుర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్లో అదానీపై తాను ప్రసంగించినప్పుడే తన లోక్‌సభ సభ్వత్వం రద్దయ్యిందని గాంధీ దుయ్యబట్టారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని.. కానీ అది వాయిదా వేసుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని ఆరోపించారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయవచ్చు. అయితే డీలిమిటేషన్, కొత్త జనాభా లెక్కల సాకుతో 10 ఏళ్లపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు ఈరోజే అమలు చేయాలని కోరుకుంటోంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
స్కూటీపై రాహల్ రైడ్..
జైపుర్‌లోని మహారాణి కళాశాలలో ప్రతిభ కనబరిచిన యువతులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు రాహుల్ గాంధీ. అనంతరం వారు స్కూటర్ నడుపుతుండగా.. వెనుక కూర్చొని జైపుర్ వీధుల్లో ప్రయాణించారు.
-
#WATCH | Rajasthan: Congress MP Rahul Gandhi distributed two-wheelers to meritorious girl students at Maharani College and rides pillion on a girl's scooter in Jaipur pic.twitter.com/nsQ17rT1u3
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Rajasthan: Congress MP Rahul Gandhi distributed two-wheelers to meritorious girl students at Maharani College and rides pillion on a girl's scooter in Jaipur pic.twitter.com/nsQ17rT1u3
— ANI (@ANI) September 23, 2023#WATCH | Rajasthan: Congress MP Rahul Gandhi distributed two-wheelers to meritorious girl students at Maharani College and rides pillion on a girl's scooter in Jaipur pic.twitter.com/nsQ17rT1u3
— ANI (@ANI) September 23, 2023
రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం : ఖర్గే
బీజేపీ మహిళా రిజర్వేషన్ తెచ్చిందని.. కానీ అదే బిల్లు తాము ప్రవేశపెట్టినప్పుడు విరోధించింది ఆ పార్టీయేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 'మేము (బీజేపీ) కొత్త పార్లమెంట్ కట్టామని నటీనటులను, తదితరులను పిలిచి చూపించారు. కానీ అది ప్రజా సమస్యలపై చర్చించే వేదిక. ప్రదర్శనశాల కాదు. మోదీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, ఈడీ, ఐటీ, సీబీఐ అనే నలుగురు అభ్యర్థులను మోదీ నిలబెట్టారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి నటీమణులను ఆహ్వానించారు. కానీ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం అవమానకరం. ఇదే పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంటరాని వ్యక్తి కాబట్టి అహ్వానించలేదు' అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు ఖర్గే.
-
#WATCH | Jaipur. Rajasthan: Congress President Mallikarjun Kharge says, "...(Congress) has people from all communities. BJP doesn't even let anyone come near. They did not even invite President Droupadi Murmu to the inauguration of the New (Parliament) building... You (BJP)… pic.twitter.com/59OsbodM1b
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaipur. Rajasthan: Congress President Mallikarjun Kharge says, "...(Congress) has people from all communities. BJP doesn't even let anyone come near. They did not even invite President Droupadi Murmu to the inauguration of the New (Parliament) building... You (BJP)… pic.twitter.com/59OsbodM1b
— ANI (@ANI) September 23, 2023#WATCH | Jaipur. Rajasthan: Congress President Mallikarjun Kharge says, "...(Congress) has people from all communities. BJP doesn't even let anyone come near. They did not even invite President Droupadi Murmu to the inauguration of the New (Parliament) building... You (BJP)… pic.twitter.com/59OsbodM1b
— ANI (@ANI) September 23, 2023
Rahul Gandhi Vs Amit Shah On OBCs : రాహుల్ వర్సెస్ షా.. ఓబీసీలకు ప్రాధాన్యంపై డైలాగ్ వార్