ETV Bharat / bharat

'తమిళనాడుతో పాటు దేశ ప్రజలను అవమానించిన మోదీ!' - ఆటో బయోగ్రఫీ

Rahul Gandhi on Modi: తమిళనాడుతోపాటు దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. తమిళనాడు అంటే రెండు అక్షరాలు కాదని, 3వేల ఏళ్ల చరిత్ర అని పేర్కొన్నారు. అది మోదీ అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ ఆత్మకథను రాహుల్ ఆవిష్కరించారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Feb 28, 2022, 7:39 PM IST

తమిళనాడు అంటే రెండు అక్షరాలు కాదని, 3వేల ఏళ్ల చరిత్ర కలిగినదని పేర్కొన్నారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. అది ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ ఆత్మకథ 'ఉంగళిల్​ ఒరువాన్​'(మీలో ఒకరు)అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు రాహుల్​ గాంధీ. అనంతరం ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తమిళనాడుకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలపై కొత్త ఆలోచనలను ప్రయోగించాలని చూశారని, రాష్ట్రంతో పాటు దేశాన్ని అవమానించారు ఆరోపించారు.

stalins-autobiography
పుస్తక ఆవిష్కరణలో మాట్లాడుతున్న రాహుల్​ గాంధీ

"ప్రస్తుతం జమ్ముకశ్మీర్​ ప్రజలు తమను తాము పాలించుకోలేకపోతున్నారు. వారిని గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​ అధికారులు పరిపాలిస్తున్నారు. పంజాబ్​లో ఏకపక్షంగా 100 కిలోమీటర్ల భూభాగాన్ని బీఎస్​ఎఫ్​కు ఇచ్చారు. మన విజన్​ భిన్నత్వంలో ఏకత్వం అయితే.. వారిది చట్టాల ద్వారా ఏకత్వాన్ని సాధించటం. తమిళనాడు అంటే రెండు అక్షరాలు కాదు. 3వేల ఏళ్ల చరిత్ర. దానిని ప్రధాని అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజలపై కొత్త ఆలోచనలను ప్రయోగించాలని చూసి.. రాష్ట్రంతో పాటు దేశాన్ని అవమానించారు. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​, బిహార్​ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​, నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఓమర్​ అబ్దుల్లా పాల్గొన్నారు. పుస్తకం తొలి కాపీని డీఎంకే సీనయర్​ నేత, రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్​ అందుకున్నారు.

stalins-autobiography
పుస్తక ఆవిష్కరణకు హాజరైన జనం

ఇదీ చూడండి: 'కఠిన సవాళ్లు వస్తున్నాయ్​.. భారత్​ మరింత శక్తిమంతం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.