Rahul Gandhi On Modi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కొవిడ్-19 సమయంలో మోదీ రైతులను ఏడాదిపాటు రోడ్లపై వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని ఎప్పుడూ చేయదని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కిచ్ఛాలో నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. భారత్కు ప్రధానమంత్రి లేరని.. కానీ తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు నోరుమెదపకుండా ఉండాలని అనుకునే రాజు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ రైతులు, యువత, కార్మికులు, పేదల భాగస్వామ్యంతో ముందుకెళ్తోందని అన్నారు రాహుల్ గాంధీ.
70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.
ఇవీ చూడండి: