Rahul Gandhi On Caste Census : తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'ఆవాస్ న్యాయ సమ్మేళన్'లో పాల్గొన్న రాహుల్.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తమ పార్టీ రీమోట్ కంట్రోల్‌ను నొక్కితే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరతాయన్న రాహుల్... అదే బీజేపీ రీమోట్ కంట్రోల్ నొక్కితే అదానీకి విమానాశ్రయాలు, పోర్టులు, కాంట్రాక్ట్‌లు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేబినెట్ క్యార్యదర్శులు, కార్యదర్శులే నడుపుతారని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది కార్యదర్శుల్లో.. ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతాన్ని మాత్రమే వీరు నియంత్రిస్తున్నారన్న రాహుల్.. దేశంలో ఐదు శాతమే ఓబీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.
-
#WATCH | Congress leader Rahul Gandhi at a public meeting in Chhattisgarh's Bilaspur
— ANI (@ANI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"...Only 3 out of 90 secretaries in the government of India are OBCs...Caste census will be an x-ray of India. With it, we will be able to find how many people belong to SC, ST, Dalit, and… pic.twitter.com/nLdlWhaQVN
">#WATCH | Congress leader Rahul Gandhi at a public meeting in Chhattisgarh's Bilaspur
— ANI (@ANI) September 25, 2023
"...Only 3 out of 90 secretaries in the government of India are OBCs...Caste census will be an x-ray of India. With it, we will be able to find how many people belong to SC, ST, Dalit, and… pic.twitter.com/nLdlWhaQVN#WATCH | Congress leader Rahul Gandhi at a public meeting in Chhattisgarh's Bilaspur
— ANI (@ANI) September 25, 2023
"...Only 3 out of 90 secretaries in the government of India are OBCs...Caste census will be an x-ray of India. With it, we will be able to find how many people belong to SC, ST, Dalit, and… pic.twitter.com/nLdlWhaQVN
"బీజేపీ లేదా మోదీ ఒకసారి బటన్ నొక్కితే అదానీకి మంబయి ఎయిర్‌పోర్ట్, రెండోసారి నొక్కితే రైల్వే ప్రాజెక్టులు, మూడోసారి నొక్కితే మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్‌లు లభిస్తాయి. ప్రస్తుతం రెండు రిమోట్ కంట్రోల్‌లు నడుస్తున్నాయి. ఇది మా పార్టీ రిమోట్ కంట్రోల్. దీన్ని నొక్కితే క్వింటా వరి ధాన్యానికి రూ. 2,500 నగదు నేరుగా రైతుల ఖాతాలో జమవుతాయి. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నిర్మితమవుతాయి. అయితే బీజేపీ బటన్ నొక్కితే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయిపోతాయి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Train Journey : బిలాస్‌పుర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ రైలులో ప్రయాణించారు. బిలాస్‌పుర్ నుంచి రాయ్‌పుర్ వరకు రైలులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే రైలులోని ప్రయాణికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
కాగా, రాహుల్ ఇటీవల రైల్వే కూలీలతో ముచ్చటించారు. దిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్లో పనిచేస్తున్న కూలీలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే కూలీల యూనిఫాం ధరించి లగేజీని సైతం రాహుల్ మోశారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
यात्रा जारी है... 🚆
— Congress (@INCIndia) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieT
">यात्रा जारी है... 🚆
— Congress (@INCIndia) September 25, 2023
📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieTयात्रा जारी है... 🚆
— Congress (@INCIndia) September 25, 2023
📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieT
-
STORY | Chhattisgarh: After launching housing scheme in Bilaspur, Congress leader Rahul Gandhi boards train for Raipur
— Press Trust of India (@PTI_News) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
READ: https://t.co/JTNtWjClek
VIDEO: pic.twitter.com/AH0zyZ51PK
">STORY | Chhattisgarh: After launching housing scheme in Bilaspur, Congress leader Rahul Gandhi boards train for Raipur
— Press Trust of India (@PTI_News) September 25, 2023
READ: https://t.co/JTNtWjClek
VIDEO: pic.twitter.com/AH0zyZ51PKSTORY | Chhattisgarh: After launching housing scheme in Bilaspur, Congress leader Rahul Gandhi boards train for Raipur
— Press Trust of India (@PTI_News) September 25, 2023
READ: https://t.co/JTNtWjClek
VIDEO: pic.twitter.com/AH0zyZ51PK
Rahul Gandhi On Modi : 'మోదీజీ.. కుల గణనకు భయమెందుకు? మహిళా రిజర్వేషన్ల కోసం పదేళ్లు ఆగాలా?'
Rahul Gandhi Vs Amit Shah On OBCs : రాహుల్ వర్సెస్ షా.. ఓబీసీలకు ప్రాధాన్యంపై డైలాగ్ వార్