ETV Bharat / bharat

'రాహుల్​కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ - రాహుల్ గాంధీతో హరియాణా మహిళా రైతులు

Rahul Gandhi Haryana Farmers : రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చల్లో నిలిచింది. ఇటీవలే సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన హరియాణా మహిళా రైతులు.. రాహుల్​ పెళ్లి గురించి ఆమెతో ప్రస్తావించారు. అందుకు సంబంధించి వీడియోను రాహుల్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

rahul-gandhi-marriage-news-haryana-women-farmers-meet-sonia-gandhi-and-talk-about-rahul-marriage
రాహుల్ గాంధీ పెళ్లి న్యూస్​
author img

By

Published : Jul 29, 2023, 3:55 PM IST

rahul gandhi marriage news : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఈ మధ్యే విపక్ష సమావేశంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ మీడియా ముందు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలని సూచించగా ఇప్పుడు మరోసారి అదే చర్చ జరిగింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీతో రాహుల్‌ వివాహం గురించి అడిగారు. వివరాల్లోకి వెళ్తే..

జూలై ఆరంభంలో రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు దిల్లీకి రావాలని ఉందని ఆయనకు చెప్పారు. దాంతో రాహుల్‌ వారిని సోనియా నివాసానికి ఆహ్వానించగా.. ఇటీవల ఆ మహిళలంతా దిల్లీ వెళ్లారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్‌ తాజాగా షేర్‌ చేశారు. హరియాణా నుంచి వచ్చిన మహిళలు.. ముందుగా దిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు.

హరియాణా మహిళా రైతులకు గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక సోనియా, ప్రియాంక, రాహుల్‌ గాంధీ మహిళలతో కలిసి భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ.. సోనియా గాంధీ చెవిలో రాహుల్‌కు పెళ్లి చేద్దామా? అని అడిగారు. దీనికి సోనియా బదులిస్తూ.. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండని అన్నారు. అక్కడే ఉన్న రాహుల్‌ నవ్వుతూ 'పెళ్లి అవుతుంది.. అవుతుంది' అని అన్నారు.

ఇదే సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత తేరుకుని మహిళలతో సరదగా ముచ్చటించారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'త్వరగా పెళ్లి చేసుకో.. ఎక్కువ టైమ్​ లేదు!'.. లాలూ సూచన.. ఓకే చెప్పిన రాహుల్!
Rahul Gandhi Lalu Yadav : కొద్ది రోజుల క్రితం పట్నాలోని నీతీశ్​ కుమార్ నివాసంలో భేటీ అనంతరం విపక్ష నేతలు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్​లోనూ రాహుల్​ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పగలదని భావిస్తున్న విపక్ష పార్టీల సమావేశంలో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నవ్వులు పూయించారు. బీజేపీపై పోరులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(53) ఎంతో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన లాలూ.. అనూహ్యంగా పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.