దేశంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని తాము ఎప్పుడూ ప్రకటించలేదని కేంద్రం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అసలు ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
-
PM- Everyone will get vaccine.
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
BJP in Bihar elections- Everyone in Bihar will get free vaccine.
Now, GOI- Never said everyone will get vaccine.
Exactly what does the PM stand by?
">PM- Everyone will get vaccine.
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2020
BJP in Bihar elections- Everyone in Bihar will get free vaccine.
Now, GOI- Never said everyone will get vaccine.
Exactly what does the PM stand by?PM- Everyone will get vaccine.
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2020
BJP in Bihar elections- Everyone in Bihar will get free vaccine.
Now, GOI- Never said everyone will get vaccine.
Exactly what does the PM stand by?
" ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని తొలుత ప్రధాని మోదీ చెప్పారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బిహార్ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు భాజపా ప్రకటించింది. కానీ, తాము అందరికీ టీకా అందిస్తామని ఎప్పుడూ ప్రకటించలేదని కేంద్రం మాట మార్చింది. ఈ విషయంలో అసలు మోదీ ఉద్దేశం ఏంటి?" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అందరికీ అవసరంలేదు..
కొవిడ్ టీకా ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిన అవసరంలేదని ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో వివరించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ కేంద్రంపై ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:'దివ్యాంగుల మెరుగైన జీవితం కోసం సమష్టిగా కృషి అవసరం'