ETV Bharat / bharat

దేశ ప్రజలపైనే యుద్ధం ప్రకటించారు: భాజపా

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై మండిపడ్డారు కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ. దేశ ప్రజలపై రాహుల్​.. యుద్ధం ప్రకటించారని ఆరోపించారు.

సాగు చట్టాలను రద్దు చేసి వాటిని చెత్తబుట్టలో వేయడమే రైతు సమస్యలకు పరిష్కారమని అభిప్రాయపడ్డారు రాహుల్​ గాంధీ. కొత్త చట్టాలతో రైతుల జీవితమే దుర్భరమయ్యే అవకాశాలున్నాయని, అందుకే రైతులు ఇంతలా ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
author img

By

Published : Jan 30, 2021, 6:43 AM IST

రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దేశ ప్రజ‌ల‌పై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశంలో హింస‌ను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అన్నారు. ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడు దేశంలో శాంతికి బదులుగా హింస చేలరేగాలని కోరుకోలేదన్న ఇరానీ.. రాహుల్‌ మాత్రం గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన దాడులను దేశ‌వ్యాప్తంగా విస్తరించాల‌ని భావిస్తున్నారని విమర్శించారు.

జనవరి 26న దిల్లీలో 400 మంది పోలీసులు గాయపడితే.. వారి గురించి రాహుల్​ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, మన జాతీయ జెండాను అవమానించే అరాచక శక్తులకు ఆయన అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.

'చెత్తబుట్టలో వేయండి'

అంతకుముందు.. ప్రధాని న‌రేంద్ర మోదీ నూతన వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌క‌పోతే దిల్లీ, దాని స‌మీప ప్రాంతాల‌కు ప‌రిమిత‌మైన రైతు ఉద్యమం దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తుంద‌ని హెచ్చరించారు రాహుల్‌ గాంధీ. సాగు చట్టాలను రద్దు చేసి వాటిని చెత్తబుట్టలో వేయడమే రైతు సమస్యలకు పరిష్కారమని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాలతో రైతుల జీవితమే దుర్భరమయ్యే అవకాశాలున్నాయని, అందుకే రైతులు ఇంతలా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పైవ్యాఖ్యలు చేశారు స్మృతి.

ఇదీ చూడండి: 'రైతులపై దాడితో దేశం బలహీనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.