పంజాబ్ పోలీసులు ఓ డ్రగ్ ముఠా గుట్టురట్టు చేశారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ స్మగ్లర్ నుంచి 6.73 కిలోల హెరాయిన్‌ను (Heroin Seized) పట్టుకున్నారు. దీని విలువ సుమారు 34కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని పొలాల్లో ఈ డ్రగ్స్‌ను గుర్తించినట్లు ఫిరోజ్‌పుర్ యాంటీ నార్కోటిక్స్ అధికారులు తెలిపారు.
నిందితుడ్ని ఫిరోజ్బాద్లోని నౌరంగ్ కీ సెయిల్ గ్రామానికి చెందిన దిదార్ సింగ్‌గా గుర్తించారు. తొలుత నిందితుడి నుంచి 120 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం (Heroin Seized) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం దర్యాప్తు చేయగా.. అతనికి పాకిస్థాన్‌కు చెందిన మాదకద్రవ్యాల స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు కనిపెట్టారు. అక్కడ నుంచి డ్రగ్స్ తరచూ తీసుకొచ్చే వారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించిన అధికారులు భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పొలాల్లో దాదాపు 6.7 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: సింఘు సరిహద్దులో 'హత్య'పై మాటల యుద్ధం