ETV Bharat / bharat

కాలువలో వరదలా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు! - పంజాబ్ రెమ్​డెసివిర్ బ్లాక్​మార్కెట్

దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ.. మహమ్మారి చికిత్సలో వినియోగించే ఔషధాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనినే అదునుగా భావించిన కొందరు నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా.. పంజాబ్‌లో ఓ కాలువలో కొట్టుకొస్తున్న రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Punjab police recover remdesivir vials from Bhakra canal
కాలువలో వరదలా కొట్టుకొచ్చిన రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు
author img

By

Published : May 8, 2021, 10:07 PM IST

కాలువలో వరదలా కొట్టుకొచ్చిన రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు

కరోనా చికిత్సలో కీలక ఔషధంగా భావిస్తున్న రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తూ.. కొందరు అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్న వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్​లోని రోపార్​ జిల్లా సాలెంపూర్ గ్రామ సమీపంలో ఉన్న భాక్రా కాలువలో పెద్దఎత్తున రెమ్‌డెవిసిర్ ఇంజక్షన్లు కొట్టుకొస్తున్న విషయాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే.. డీఎస్పీ సుఖ్​జిందర్ సింగ్ అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు.. సీనియర్ వైద్యాధికారి(ఎస్ఎంఓ)ని సాలెంపూర్ గ్రామంలోని ఘటన స్థలానికి పంపారు. అయితే.. వీటిని పరీక్షించిన జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి నకిలీవిగా పేర్కొన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. నదిలో ఇంజక్షన్ల కోసం మరింతగా గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి: పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

కాసుల కోసం కక్కుర్తి... అధిక ధరలకు రెమ్​డెసివిర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.