ETV Bharat / bharat

పంజాబ్​ 'సీఎం' ఎంపికపై కాంగ్రెస్​ హైకమాండ్​ తర్జనభర్జన! - punjab congress crisis

పంజాబ్​ తదుపరి సీఎంపై ఆదివారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది(punjab cm election). కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.(punjab congress crisis)

congress
పంజాబ్​ కాంగ్రెస్​
author img

By

Published : Sep 19, 2021, 11:51 AM IST

Updated : Sep 19, 2021, 1:42 PM IST

పంజాబ్​ సంక్షోభానికి(punjab congress crisis) ఆదివారంతో ముగింపు పడుతుందని కాంగ్రెస్​ శ్రేణులు ఆశిస్తున్న తరుణంలో మరో అనూహ్య పరిణామం! తదుపరి సీఎంను ప్రకటించేందుకు ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది(punjab cm election). నూతన సీఎల్​పీ నేతపై అధిష్ఠానం ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ.. సీనియర్​ నేత కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ సీఎం పదవికి శనివారం రాజీనామా చేశారు. అప్పటి నుంచి​ తదుపరి సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం సీఎల్​పీ భేటీ జరిగినప్పటికీ.. అందులో స్పష్టత రాలేదు. అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఎవరి పేరు చెబితే.. వారే సీఎం అని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తీర్మానించారు(punjab congress news).

అయితే ఈ విషయంలో అధిష్ఠానం ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నట్టు తాజా పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎల్​పీ భేటీ జరగాల్సి ఉంది. హైకమాండ్​ నుంచి స్పందన లేకపోవడం వల్ల చివరి నిమిషంలో భేటీ వాయిదా పడింది(punjab congress news today).

ఇదీ చూడండి:- సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా- 'అవమానాలు భరించలేకే'

ఇద్దరు డిప్యూటీ సీఎంలు?

మరికొన్ని నెలల్లో పంజాబ్​ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షంలో లుకలుకలు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓ ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు కాంగ్రెస్​ హైకమాండ్​ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంపైనే.. డిప్యూటీ సీఎం పదవులు ఎవరెవరికి వరిస్తాయన్నది తెలుస్తుందని సమాచారం.

వద్దన అంబిక సోనీ...

కాంగ్రెస్​ సీనియర్​ నేత అంబిక సోనీకి సీఎం పదవిని ఆఫర్​ చేశారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అయితే ఆ ఆఫర్​ను సోనీ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'అవును నాకు ఆఫర్​ వచ్చింది. కానీ నేను తిరస్కరించాను. పంజాబ్​కి ఓ సిక్కు నేత సీఎంగా ఉండాలన్నది నా అభిప్రాయం. అదే విషయాన్ని హైకమాండ్​కు చెప్పాను. అధిష్ఠానం సిక్కుకే సీఎం పదవినిస్తుందని ఆశిస్తున్నా,' అని తెలిపారు.

రేసులో సిద్ధూ?

సోనీ కాకుండా.. సీఎం రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షులు సునీల్‌ జాఖడ్‌, ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, తాజా మాజీ మంత్రి సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌లలో ఒకరిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి బేయంత్‌ సింగ్‌ మనవడు రన్వీత్‌ సింగ్, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ పేరు కూడా వినవస్తోంది. అయితే, సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అమరీందర్‌.. సిద్ధూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎంని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. ఆయన సీఎం కావడం పంజాబ్‌కు నష్టదాయకమని విరుచుకుపడ్డారు.

కెప్టెన్​ తప్పులూ ఉన్నాయి!

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్లీనంగా రగులుతూ వస్తున్న లుకలుకలు చివరకు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌(Amarinder singh news) పదవికి ఎసరు పెట్టాయి. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నుంచి, ఇంతకు ముందు పర్గత్‌సింగ్‌, ప్రతాప్‌సింగ్‌ భజ్వా వంటి ఇతర నేతల నుంచి అమరీందర్‌ (Amarinder singh news Punjabi) అసంతృప్తిని ఎదుర్కొంటూనే వస్తున్నారు. సామాన్యులకు కాదు కదా కనీసం తమకైనా సీఎం అందుబాటులోకి లేకపోవడంతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై పార్టీ అధిష్ఠానానికి(Punjab politics news) ఫిర్యాదు చేశారు. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం, పార్టీ హైకమాండ్‌ ఒత్తిడి చేయడంతో ఆయనకు విధిలేని పరిస్థితులు ఎదురయ్యాయి. బలాన్ని తెలుసుకోవడానికి తన ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తే 13 మంది ఎమ్మెల్యేలే వచ్చారు. దాంతో ఆయనకు సీఎల్‌పీలో ఎదురయ్యే పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'సిద్ధూకు పాక్​తో సంబంధాలు.. సీఎంను చేస్తే దేశానికే ప్రమాదం'

Last Updated : Sep 19, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.