ETV Bharat / bharat

పరువు హత్య కలకలం.. సొంత చెల్లిని కత్తులతో పొడిచి.. - పంజాబ్ పరువు హత్య న్యూస్

Punjab Honour killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న చెల్లిని సొంత అన్న అతికిరాతకంగా చంపేశాడు. కుటుంబ సభ్యుల సాయంతో పదునైన కత్తులతో చెల్లిని పొడిచి చంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Punjab Honour killing
Punjab Honour killing
author img

By

Published : Jun 18, 2022, 10:30 PM IST

Punjab Honour killing: పంజాబ్​లో పరువు హత్య కలకలం రేపింది. తార్న్ తారన్ సాహిబ్​లో తన సొంత చెల్లిని అన్న హత్య చేశాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వివాహం చేసుకుందని ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడి కజిన్ అమర్.. మహిళ హత్యకు సహకరించాడు. మృతురాలిని 21ఏళ్ల స్నేహగా గుర్తించారు. ఆమె పట్టి పట్టణంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. రాజన్ జోషి అనే వ్యక్తిని స్నేహ వివాహం చేసుకుందని.. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు కోపంగా ఉన్నారని పోలీసులు వివరించారు. ముఖ్యంగా స్నేహ సోదరుడు రోహిత్.. ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడని తెలిపారు.

చాలా రోజుల నుంచే నవదంపతులను, వారి కుటుంబాన్ని రోహిత్ బెదిరిస్తున్నాడు. గతంలో స్నేహపై ఆమె తల్లి, సోదరి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. స్నేహ సోదరులు, బంధువులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు రావాలని పిలిచారు. రాత్రి 8 గంటల సమయంలో స్నేహ బయటకు వచ్చింది. ఆమెను హత్య చేసేందుకు అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు.. పదునైన కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమైన స్నేహ.. ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక ఎస్సై బల్జిందర్ సింగ్ తెలిపారు. నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. త్వరలోనే వారిని పట్టుకుంటామని సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు, చట్టబద్ధంగానే తాము వివాహం చేసుకున్నామని స్నేహ భర్త రాజన్ జోషి తెలిపారు. హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకొని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.