శాసనసభ ఎన్నికలకు ముందు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దిల్లీలో జనవరి 26న జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో(farmers tractor rally) పాల్గొని అరెస్టయిన 83మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చరణ్‌జీత్ చన్నీ ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం(delhi farmers protest news) చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు.
" మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు మా ప్రభుత్వ మద్దతు ఉంటుందని మరోమారు చెబుతున్నా. జనవరి 26న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించాం."
- చరణ్‌జీత్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి.
అయితే.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పంజాబ్ ప్రభుత్వం వారికి ఆర్థికసాయం ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గణతంత్ర దినోత్సవం రోజు రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీకి(farmers tractor rally) పోలీసులు షరతులతో అనుమతించారు. నిర్దేశించిన మార్గాల్లోనే ర్యాలీ(delhi farmers protest news) చేపట్టాలని ఆంక్షలు విధించారు. కానీ ర్యాలీ ప్రారంభమైన కాసేపటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి అనుమతిలేని మార్గాల గుండా ఎర్రకోటకు చేరుకున్నారు. ఆ తర్వాత విధ్వంసకర ఘటనలు(tractor rally violence) చోటుచేసుకున్నాయి. అందుకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏడాదికిపైగా పోరాటం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. గత ఏడాది నవంబర్ 26 నుంచి దిల్లీలోని వివిధ సరిహద్దుల్లో ఆందోళన(delhi farmers protest news) చేస్తున్నారు రైతులు(Tractor rally). పలు దఫాలుగా కేంద్రం, రైతు నేతల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతుండగా.. కుదరదని, మార్పులు చేసేందుకు తాము సిద్ధమని కేంద్రం చెబుతోంది.
ఇదీ చూడండి: రైతుల 'రణతంత్ర' పరేడ్.. సాగిందిలా..