ETV Bharat / bharat

అప్పుల బాధతో కుమారుడితో కలిసి రైతు ఆత్మహత్య

పంజాబ్​లో ఓ డెబ్భై ఏళ్ల రైతు, అతని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోవడం.. రైతు రుణమాఫీ హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం.. ఈ పరిణామాలతో కలత చెందిన తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్​ నోట్​లో పేర్కొన్నారు.

punjab son and father sucide
కమారుడితో సహా రైతు ఆత్మహత్య
author img

By

Published : Feb 20, 2021, 11:01 PM IST

పంజాబ్​లో విషాదం జరిగింది. అప్పుల బాధ భరించలేక ఓ రైతు, అతని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హోషియార్​పుర్​ జిల్లా ముహాదిపుర్​లో జగ్తార్​ సింగ్​(70), అతని కుమారుడు కృపాల్​ సింగ్​(42) శనివారం ఉదయం మృతిచెందినట్లు డీఎస్​పీ మునీష్​ కుమార్​ తెలిపారు. విషాహారం తీసుకుని వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. వారి ఇంట్లో ఓ సూసైడ్​నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున, కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయని నేపథ్యంలోనే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. మృతి చెందిన తండ్రీ కుమారుడికి తలో ఎకరం పొలం ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

రాజకీయ రగడ..

అన్నదాతల ఆత్మహత్య నేపథ్యంలో ప్రతిపక్ష శిరోమణి అకాళీ దళ్(ఎస్​ఏడీ)​, ఆమ్​ ఆద్మీ పార్టీలు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలు.. అన్నదాతల ఆత్మహత్యలతో బయటపడ్డాయని ఎస్​ఏడీ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్​ మజితీయా ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఆప్​ నేతలు కుల్తార్​ సింగ్​ సంద్వాన్​, గుర్మీత్​సింగ్..​ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:మోదీ.. పాత కథల్లోని అహంకార రాజు: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.