పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ కుమారుడి వివాహం (Punjab CM Channi son marriage) ఎలాంటి ఆడంబరం లేకుండా జరిగింది. మొహాలీలోని ఓ గురుద్వారాలో చన్నీ కుమారుడు నవ్‌జీత్ సింగ్, డేరా బస్సీ ప్రాంతంలోని అమ్లాలా గ్రామానికి చెందిన సిమ్రాన్ధీర్ కౌర్‌ను (Punjab CM Channi daughter in law) వివాహం చేసుకున్నారు.
'గురుద్వారా సచ్ఛా ధాన్'లో సిక్కు సంప్రదాయాల ప్రకారం 'ఆనంద్ కరాజ్' (వివాహ కార్యక్రమం) నిర్వహించారు. కుమారుడిని పక్కన కూర్చోబెట్టుకొని సీఎం చన్నీ స్వయంగా కారు నడుపుతూ గురుద్వారాకు వచ్చారు.
సిద్ధూ గైర్హాజరు
పంజాబ్ గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సుఖ్జిందర్ సింగ్ రంధావ, ఓపీ సోని, మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, బ్రహ్మ మోహింద్ర, ప్రగత్ సింగ్, త్రిపథ్ రజిందర్ సింగ్ బజ్వా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్, ఎంపీ మనీశ్ తివారీ తదితరులు వివాహానికి హాజరయ్యారు. జమ్ము పర్యటనలో ఉన్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. వివాహానికి రాలేదు.
ఇదీ చదవండి: 'పదవి ఉన్నా, లేకున్నా గాంధీ కుటుంబం వెంటే!'