ETV Bharat / bharat

హాకీ మ్యాచ్​లో గోల్​కీపర్​గా సీఎం.. క్రీడా మంత్రికి చుక్కలు! - పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ

అభిమానులతో కిక్కిరిసిపోయి ఉన్న క్రీడా మైదానంలోకి ఓ ముఖ్యమంత్రి అడుగుపెట్టారు. ఆట చూసేందుకు ఆయన వచ్చారని అనుంకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! ఆ మ్యాచ్​లో స్వయంగా బరిలోకి దిగిన సీఎం.. గోల్​కీపర్​గా వ్యవహరించారు. క్రీడల మంత్రి గోల్​ చేసేందుకు ప్రయత్నించగా.. సమర్థంగా అడ్డుకున్నారు.

Punjab CM
సీఎం హాకీ
author img

By

Published : Oct 31, 2021, 7:42 PM IST

Updated : Oct 31, 2021, 8:52 PM IST

పంజాబ్ ముఖ్యమంత్రి గోల్​కీపర్ అవతారం ఎత్తారు. జలంధర్‌లోని కటోచ్ స్టేడియంలో జరిగిన 'సుర్జిత్ హాకీ టోర్నమెంట్' ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. పంజాబ్ క్రీడా మంత్రి పర్గత్ సింగ్​తో కలసి ఆయన మ్యాచ్ ఆడారు.

Punjab CM
గోల్​కీపింగ్ చేస్తున్న సీఎం

పంజాబ్ క్రీడల మంత్రి పర్గత్ సింగ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా అడ్డుకున్నారు. పర్గత్​ సింగ్ ఒలింపిక్స్ మాజీ క్రీడాకారుడు కావడం విశేషం. ఆయన ఐదు గోల్స్​ చేసేందుగు ప్రయత్నించగా మూడింటిని సీఎం చాకచక్యంగా అడ్డుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టు ఆటగాళ్లు చేసిన గోల్స్​నూ సమర్ధంగా అడ్డుకున్నారు సీఎం.

Punjab CM
సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. మంత్రి పర్గత్ సింగ్

వాస్తవానికి మ్యాచ్​ను వీక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని.. గేమ్​ ఆడాల్సిందిగా నిర్వాహకులు కోరారు. దీనికి వెంటనే అంగీకరించిన సీఎం.. మరో మంత్రితో కలసి గోల్ కీపర్​గా బరిలో దిగారు. 'ఈ మ్యాచ్​తో తాను కుర్రాడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.. ఇది తన జీవితంలో అపురూపమైన రోజు' అని మ్యాచ్ అనంతరం చన్ని తెలిపారు. యువతలోని శక్తిని అనుకూలంగా మార్చుకునేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పంజాబ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంజాబ్‌కు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామన్నారు.

Punjab CM
మంత్రితో కలసి మైదానంలోకి అడుగుపెడుతున్న సీఎం..

మొత్తంగా చన్నీ, సింగ్‌లు కనబర్చిన ఆటతీరుకి స్టేడియం అంతా చప్పట్లతో మారుమోగింది. మరోవైపు.. సీఎం మ్యాచ్​​కు సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తున్నారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ-అమరీందర్ సింగ్​ల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో చన్నీ గత నెల్లో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.