ETV Bharat / bharat

'కొత్త మంత్రి'పై సీఎం వేటు.. వెంటనే అరెస్ట్.. అసలేం జరిగింది? - విజయ్​ సింగ్లా

Bhagwant mann: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవి కోల్పోయిన పంజాబ్​ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్​ సింగ్లాను ఏసీబీ అరెస్ట్​ చేసింది. కేబినెట్​ నుంచి ఆయనను ముఖ్యమంత్రి భగవంత్​ మాన్ తొలగించిన కొద్దిసేపటికే అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతికి కూడా అవకాశం ఇవ్వమన్నారు సీఎం.

పంజాబ్​ మంత్రిపై వేటు
పంజాబ్​ మంత్రిపై వేటు
author img

By

Published : May 24, 2022, 1:28 PM IST

Updated : May 24, 2022, 4:38 PM IST

Bhagwant mann: అవినీతి రహిత పాలన అందిస్తామని బాధ్యతలు చేపట్టిన పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్య శాఖ మంత్రి విజయ్​ సింగ్లాను పదవి నుంచి తొలగించారు. కాంట్రాక్టులపై సింగ్లా సహా పలువురు అధికారులు 1 శాతం కమీషన్​ తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉండటం వల్ల ఈ సీఎం వారిపై చర్యలు చేపట్టారు. అనంతరం ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.

"రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదు. ప్రజలు ఎన్నో అంచనాల మధ్య ఆమ్​ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారు. వారి అంచనాలను అందుకునే విధంగా పనిచేయడం మా బాధ్యత. కేజ్రీవాల్​ నేతృత్వంలో అవినీతిని పారదోలేందుకు కృషి చేస్తాం"

-భగవంత్​ మాన్​, పంజాబ్​ సీఎం

సింగ్లాను భగవంత్​ మాన్​ పదవి నుంచి తప్పించడంపై ఆప్​ అధ్యక్షుడు, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ హర్షం వ్యక్తం చేశారు. భగవంత్​ తీసుకున్న నిర్ణయం పట్ల దేశం గర్విస్తోందని ప్రశంసించారు. "నిజానికి ఈ విషయం గురించి మీడియాకు, ప్రతిపక్షాలకు తెలియదు. కాబట్టి మాన్​ కావాలనుకుంటే నిందితుల నుంచి వాటా కోరి వారిని పదవి నుంచి తప్పించకుండా చేయొచ్చు. కానీ మాన్​ అలా చేయలేదు. తప్పు చేసినందుకు మంత్రిపై చర్యలు తీసుకున్నారు. భగవంత్​.. మేము మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాము." అని కేజ్రీవాల్​ పేర్కొన్నారు. అంతకుముందు.. 2015లో దిల్లీలోని ఆమ్​ఆద్మీ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కేబినెట్​ మంత్రిని కేజ్రీవాల్​ పదవి నుంచి తప్పించారు.

ఇదీ చూడండి : 'ప్రధాని మోదీ విజన్​లో వాళ్లు మాత్రమే ఉంటారు'

Last Updated : May 24, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.