ETV Bharat / bharat

కడుపునొప్పితో బాధపడుతున్న ఆ రాష్ట్ర సీఎం.. అపోలో ఆస్పత్రిలో చేరిక - పంజాబ్​ సీఎం

Bhagwant Mann Admitted Hospital: కడుపునొప్పితో బాధపడుతున్న పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​.. దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి.

Punjab CM Bhagwant Mann admitted to hospital in Delhi

author img

By

Published : Jul 21, 2022, 10:03 AM IST

Updated : Jul 21, 2022, 10:24 AM IST

Bhagwant Mann Admitted Hospital: పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ అస్వస్థతకు గురయ్యారు. దీంతో దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బుధవారం చేరినట్లు.. అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపునొప్పితో బాధపడుతున్న సీఎంకు ఇన్ఫెక్షన్​ అయినట్లు వైద్యులు వెల్లడించారు. జులై 7న మాన్​ నిరాడంబరంగా.. రెండో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్​ప్రీత్ కౌర్​ను సీఎం మాన్ వివాహమాడారు. చండీగఢ్​లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఈ ఏడాది జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ సంచలన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. మార్చి 16న పంజాబ్​ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్​ మాన్ ప్రమాణస్వీకారం చేశారు​. 117 స్థానాలున్న శాసనసభలో.. ఆప్​ 92 చోట్ల గెలిచి సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్​ 18 స్థానాలకే పరిమితమైంది.

Last Updated : Jul 21, 2022, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.