Hapus mangoes: రత్నగిరి హపూస్ మామిడి పళ్లు ఈ ఏడాది ముందుగానే మార్కెట్లోకి వచ్చాయి. 'కొంకణ్ రాజు'గా ప్రసిద్ధి చెందిన ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్లో నాలుగు డజన్లు సుమారు రూ. 15 వేలకు అమ్ముడు అవుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.

సాధారణంగా అయితే ఈ రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ఏటా మకర సంక్రాంతికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే మార్కెట్లోకి వచ్చాయి. వాతావరణ మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే వచ్చినట్లు విక్రయదారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పండ్ల సీజన్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉంది.

ఈ ఏడాది మామిడికి మంచి గిరాకీ...
కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి మామిడి పండ్లు మార్కెట్లోకి రాలేదని వ్యాపారులు చెప్పారు. ఈ ఏడాది మాత్రం రత్నగిరి రకం మామిడి కాయలు ముందుగానే వచ్చినట్లు పుణెలోని దేశాయ్ బ్రదర్స్ దుకాణం యజమాని మందర్ దేశాయ్ తెలిపారు.

లాక్‌డౌన్ ఉంటే సప్లైపై ప్రభావం...
ఈ ఏడాదిలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారని అనుకుంటున్నాం. ఈ క్రమంలోనే డిమాండ్ కూడా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా డిమాండ్, సప్లైల మధ్య తేడా కనిపించింది. ఈ సారి కూడా కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై పై ప్రభావం పడే అవకాశం ఉంది.
- మందర్ దేశాయ్, దేశాయ్ బ్రదర్స్ షాపు యజమాని
ఇదీ చూడండి: