ETV Bharat / bharat

సైన్యంలోకి పుల్వామా అమర జవాను భార్య - నిఖితా కౌల్ భారత సైన్యం

పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన భర్త త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ మహిళ దేశం గర్వించే పనిచేశారు. సైన్యంలో కఠినమైన శిక్షణను పూర్తి చేసి లెప్టినెంట్‌ బాధ్యతలు చేపట్టారు. భర్తను కోల్పోయిన ఆమెను చూసి జాలి పడిన వారే నేడు దేశం పట్ల చూపిన నిబద్ధతకు గర్వపడుతున్నారు.

Wife of Major Dhoundiyal, killed in Pulwama encounter, joins Indian Army
సైన్యంలోకి పుల్వామా అమర జవాను భార్య
author img

By

Published : May 29, 2021, 1:13 PM IST

Updated : May 29, 2021, 7:09 PM IST

దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన భర్తను నాడు సగర్వంగా సాగనంపి.. ఇప్పుడు ఆయన వారసురాలిగా సైన్యంలో చేరారు నిఖితా కౌల్‌. పుల్వామా అమరుడు మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ సతీమణి నిఖిత ఆర్మీలో లెప్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను పూర్తి చేసిన ఆమెను.. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా సైన్యంలోకి ఆహ్వనించారు. ఆమె యూనిఫాంపై నక్షత్రాలు పెట్టి సత్కరించారు.

2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మేజర్‌ విభూతి శంకర్‌ అమరులయ్యారు. అప్పటికి ఆయనకు వివాహమై.. తొమ్మిది నెలలే అయ్యింది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన నిఖితను చూసి అందరూ బాధపడ్డారు. కానీ ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడాలని చెప్పారు. అంతేకాదు.. భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను కూడా పంచుకున్నారు. దిల్లీలోని.. ఓ ఎమ్​ఎన్​సీ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు.

సైన్యంలో చేరేందుకు.. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్​ఎస్​సీ), సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్​ఎస్​బీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ తీసుకున్నారు. భర్త వదిలి వెళ్లిన దారిలో వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని నిఖిత కౌల్‌ ఉద్వేగానికి లోనయ్యారు.

"విభూ.. నువ్వు వదిలి వెళ్లిన దారిలో నేను ప్రయాణం మొదలు పెడుతున్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు అనిపిస్తోంది. 'సాధించావ్‌..' అని నాకు చెబుతున్నట్లుగా అన్పిస్తోంది. 'నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా." - నిఖిత కౌల్‌, లెప్టినెంట్‌

భర్తను కోల్పోయినపుడు జాలిపడిన వారే.. నేడు దేశం పట్ల నిఖిత నిబద్ధతను చూసి గర్వపడుతున్నారు. ఆమె చూపిన తెగువ.. ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చదవండి- పాక్​లో కశ్మీర్​ ప్రస్తావనపై భారత్ మండిపాటు

Last Updated : May 29, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.