పుదుచ్చేరిలో సీట్ల పంపకంపై డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుండగా.. 13 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఈ మేరకు తమిళనాడులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీ నేతల మధ్య జరిగిన చర్చల్లో అవగాహన కుదిరింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్, దినేశ్ కుందురావు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఈ భేటీలో పాల్గొన్నారు.
మరో రెండు స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్-డీఎంకే నిర్ణయించింది. అయితే ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయనున్నారో అనే దానిపై ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. 2016 ఎన్నికల్లో డీఎంకే 9 స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసి, 15 చోట్ల నెగ్గింది.
పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:జాతి ఐక్యతే ధ్యేయంగా మరో దండి... కదలండి!