ETV Bharat / bharat

వీరప్పన్​ తూటాలకు ఎదురు నిలిచిన పోలీసు మృతి

స్మగ్లర్ వీరప్పన్-పోలీసులకు మధ్య జరిగన కాల్పుల్లో గాయాలపాలైన సిద్ధరాజనాయక అనే ఎస్సై గుండెపోటుతో మరణించారు. పదవీ విరమణకు 5 రోజుల ముందు ప్రాణాలు కోల్పోయారు.

PSI passed away before 5 days of retirement: He had pieces of bullets in his body fired by Veerappan!
నాడు వీరప్పన్ దాడిలో గాయపడిన పోలీసు మృతి
author img

By

Published : May 26, 2021, 1:12 PM IST

Updated : May 26, 2021, 4:59 PM IST

28 ఏళ్లుగా శరీరంలో తూటాలతో జీవనం సాగించిన కర్ణాటక చామరాజనగర్​కు చెందిన పోలీస్ సబ్ ఇన్​స్పెక్టర్ సిద్ధరాజనాయక(59) బుధవారం ప్రాణాలు కోల్పోయారు. రిటైర్మెంట్​కు ఐదు రోజులు ఉండగా గుండెపోటుతో మరణించారు.

1993లో వీరప్పన్​కు- పోలీసులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో సిద్ధరాజనాయక తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో రామాపుర్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు. పోలీసులపై వీరప్పన్ జరిపిన కాల్పుల్లో సిద్ధరాజనాయకకు ఐదు బుల్లెట్లు తగిలాయి. మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నారు.

PSI
సిద్ధరాజనాయక

ఆయనకు చికిత్స అందించిన వైద్యులు.. సిద్ధరాజనాయక శరీరంలోని నాలుగు బుల్లెట్లను తొలగించారు. మరో బుల్లెట్ మాత్రం తలలోకి దూసుకెళ్లింది. బుల్లెట్ ముక్కలు ఎడమ కంటి సమీపంలో ఇరుక్కుపోయాయి. వాటిని తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బుల్లెట్​ ముక్కలను అలాగే ఉంచారు వైద్యులు. తలలో తూటాలతోనే ఇన్నేళ్లు జీవించారు.

అయినప్పటికీ ఇన్నేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండానే పని చేశారు సిద్ధరాజనాయక. లాక్​డౌన్ సమయంలోనూ విధులు నిర్వర్తించారు. మానవతావాదిగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: నిశ్శబ్దంగా శునకాన్ని వేటాడిన మొసలి

Last Updated : May 26, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.