ETV Bharat / bharat

Protests Continue Against Chandrababu Arrest: ఆగని తెలుగుదేశం నిరసన జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా జనసేన, సీపీఐ నేతలు.. - కొవ్వొత్తులతో ర్యాలీ

Protests Continue Against Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేయాలంటూ దీక్షలు కొనసాగుతునే ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీ అభిమానులు, శ్రేణులు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. జనసేన, సీపీఐ నాయకులు టీడీపీ నాయకుల దీక్షలకు, నిరసనలకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

Protests_Continue_Against_Chandrababu_Arrest

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 10:04 AM IST

Protests Continue Against Chandrababu Arrest: అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపిన జగన్‌.. అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ భిన్నరూపాల్లో పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల దీక్షా శిబిరాలను జనసేన, సీపీఐ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రిలే దీక్షల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్ధవటం మండలం సాకరాసపల్లెలో టీడీపీ సీనియర్‌ నాయకులు చమర్తి జగన్‌ రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో వీర్లయ్య ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గోపినాథ్‌ అరగుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో దీక్షా శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో రిలే దీక్షల్లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. కర్నూలులో దీక్షలకు వీరశైవ సామాజిక వర్గానికి చెందిన వారు మద్దతు తెలిపారు. నంద్యాల జిల్లా గుటుపల్లిలోని పెద్దరాజు స్వామి దర్గా వద్ద 101 టెంకాయలు కొట్టి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. నంద్యాలలోనూ టీడీపీ దీక్షలు కొనసాగాయి.

CID Two Days interrogation of Chandrababu: సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సూటిగా, స్పష్టంగా చంద్రబాబు సమాధానం

నెల్లూరు బారాషాహీద్ దర్గాలో తెలుగుదేశం నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా దైవానుగ్రహ పాదయాత్ర చేపట్టారు. కోవూరులోని వీరాంజనేయ ఆలయం నుంచి బుచ్చి మండలం జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వరకు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. పలు ఆలయాల్లో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరుగుతూ బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ దీక్షలు కొనసాగాయి.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో దీక్షా శిబిరం వద్ద మహిళలు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు, మహిళలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో నిరసన దీక్షలకు వత్సవాయి మండలంలోని పలు గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరు నుంచి గోసాల వరకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో కృష్ణానదిలో జలదీక్ష నిర్వహించారు.

Atlanta Telugu People on Chandrababu Arrest : 'న్యాయం గెలవాలి.. చంద్రబాబు బయటకు రావాలి'

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ శ్రేణులు మోకాలిపై నిలబడి న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ, సీపీఐ నాయకులు రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో మాజీమంత్రి జవహర్‌ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో దీక్షల్లో పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మునగపాక మండలం ఉమ్మలాడలోని శారద నదిలో జలదీక్ష చేపట్టారు.

విశాఖ జిల్లా భీమునిపట్నంలో టీడీపీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో చంద్రబాబు కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చీపురుపల్లిలో రిలే నిరహారదీక్షల్లో ఎస్టీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువ కొత్తూరు సముద్ర తీరంలో టీడీపీ మత్స్యకార నాయకులు జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు.

Protests in Ananthpur Against CBN Arrest: అనంతలో రగిలిన నిరసన జ్వాలలు.. అరగుండు చేయించుకుని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.