ETV Bharat / bharat

ఫిబ్రవరి నుంచి ప్రియాంక 'మిషన్​ యూపీ'

ఎన్నికల్లో వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్​ను తిరిగి గాడినపెట్టేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సిద్ధమయ్యారు. రానున్న ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు.

Priyanka Gandhi
మిషన్​ యూపీ: ఫిబ్రవరి నుంచి ప్రియాంక ప్రచారం
author img

By

Published : Jan 4, 2021, 4:24 PM IST

దిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నికలేవైనా కాంగ్రెస్​కు మాత్రం పరాజయమే ఎదురవుతోంది. మొన్న బిహార్​, నిన్న జీహెచ్​ఎంసీ ఇలా వరుస ఓటములు అటు పార్టీ నేతల్ని, ఇటు కార్యకర్తల్ని తీవ్ర నిరాశలో పడేశాయి. ఈ పరిస్థితిని మార్చి... అతి కీలకమైన 2022 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్​ప్రదేశ్​ బాధ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రాను రంగంలోకి దింపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి పునర్​వైభవం తెచ్చేందుకు ప్రియాంక కూడా ప్రణాళికలు రచిస్తున్నారు.

యూపీలోనే..

ఇందుకోసం ఫిబ్రవరిలో ప్రియాంక లఖ్​నవూలో పర్యటించనున్నారు. వీలైనంత సమయం యూపీలోనే ఆమె గడుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమిటీలను ఏర్పాటు చేసి పంచాయతీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆమె రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులతో వర్చువల్​గా జరిగిన సమావేశంలో ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ స్థాయిల్లో పరిశీలకులను ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు ఆకస్మిక పర్యటనలు చేస్తానని ప్రియాంక చెప్పారట.

ఆ ఓటు బ్యాంకుపై..

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్నందున కాంగ్రెస్​ పార్టీ కార్యకలాపాలను పెంచింది. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమోద్​ తివారీ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సీనియర్​ నేతలు సభ్యులుగా ఉన్నారు.

ఇప్పటికే జిల్లా స్థాయిలో గోసంరక్షక యాత్రలు చేస్తోంది కాంగ్రెస్. అగ్రవర్ణాల ఓటు బ్యాంకును ముఖ్యంగా బ్రాహ్మణుల ఓట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తుర్పు యూపీలో దాదాపు 100 స్థానాల్లో వీరి ప్రభావం అధికంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.