ETV Bharat / bharat

'కాంగ్రెస్​ను గెలిపిస్తే రుణమాఫీ, 20లక్షల ఉద్యోగాలు' - ప్రియాంక గాంధీ

congress up manifesto: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్​. తమను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు రుణ మాఫీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

priyanka-gandhi-releases-partys-up-manifesto
'కాంగ్రెస్​ను గెలిపిస్తే రుణమాఫీ, 20లక్షల ఉద్యోగాలు'
author img

By

Published : Feb 9, 2022, 3:53 PM IST

Congress ghoshna patra: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమను గెలిపిస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక పశువులు మేత మేయడం వల్ల పంట నష్టపోయే రైతులకు రూ.3000 పరిహారంగా చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. లఖ్​నవూలో ఈ కార్యక్రమం జరిగింది.

priyanka-gandhi-releases-partys-up-manifesto
మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రియాంక

ఉన్నతి విధాన్ పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు:

  • రైతుల పంట రుణాలు మాఫీ
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఆ తర్వాత మరో 8లక్షల ఉద్యోగాలు
  • వరి, గోధుమలకు క్వింటాకు రూ.2500
  • చెరకు ధర క్వింటాకు రూ.400
  • కొవిడ్ వారియర్స్​ కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం
  • కొవిడ్ బాధిత కుటుంబాలకు రూ.25వేలు సాయం
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య

priyanka gandhi news

భాజపా మేనిఫెస్టోపై విమర్శలు..​

యూపీ ఎన్నికల కోసం భాజపా మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో కాపీ పేస్ట్ అని ఆరోపించారు ప్రియాంక. తాము ప్రచారంలో చేసిన వాగ్దానాలను ఆ పార్టీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిందని విమర్శించారు. గత ఐదేళ్లలో ఏమీ చేయని ఆ పార్టీ, కాంగ్రెస్​ 70 ఏళ్లలో ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను భాజపా కనీసం సగం కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

మహిళల కోసం శక్తి విధాన్, యువత కోసం భర్తీ విధాన్ పేరుతో ఇప్పటికే రెండు మేనిఫెస్టోలను విడుదల చేసింది కాంగ్రెస్​. ఇప్పుడు జన ఘోషణ పత్ర పేరుతో మరో మేనిఫెస్టోను ప్రకటించింది. భాజపా, ఎస్పీ మంగళవారమే తమ మేనిఫెస్టోలు ప్రకటించాయి.

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: 'మహా ప్రభుత్వాన్ని కూల్చమన్నారు'.. వెంకయ్యకు రౌత్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.