ఐపీఎల్ ఫీవర్.. ఉత్తర్‌ప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని ఓ కారాగారంలో నిరసనకు దారితీసింది. టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేలా ఏర్పాట్లు చేయాలని ఫతేగఢ్ సెంట్రల్ జైలులోని ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. అల్పాహారాన్ని మూకుమ్మడిగా మానేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో లఖ్‌నవూలో అధికారులతో సమావేశంలో ఉన్న జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ శుక్లా.. హుటాహుటిన కారాగారానికి తిరిగివచ్చారు. ఖైదీలతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. తమ డిమాండ్లకు జైలు అధికారులు ఒప్పుకోవడం వల్ల.. దీక్షను విరమించారు.
ఖైదీలు అనుభవిస్తున్న మానసిక క్షోభను తగ్గించేందుకు.. యూపీ ప్రభుత్వం జైళ్లలో వినోదానికి ఏర్పాట్లు చేయిస్తోంది. సంగీతం కోసం స్పీకర్ల ఏర్పాటు సహా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టీవీలను సైతం అందుబాటులో ఉంచుతోంది.
ఇదీ చదవండి: ఐపీఎల్లో మరో 200 మ్యాచ్‌లు ఆడతా: రోహిత్ శర్మ