ETV Bharat / bharat

మదర్సాలో దారుణం.. బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం.. రెండు నెలలుగా..

యూపీ గాజియాబాద్​లోని ఓ మదర్సాలో దారుణం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్​ విద్యార్థులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అదనపు పాఠాలు చెప్పాల్సి ఉందని ఒకరిపై, ఫోన్​ ఆశచూపి మరొక బాలికపై గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. విషయం బాలిక తల్లికి తెలిసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, మహారాష్ట్రలో మంత్రాల నెపంతో అన్న భార్యనే హతమార్చాడు ఓ వ్యక్తి.

man kiiled brother wife for  witchcraft
man kiiled brother wife for witchcraft
author img

By

Published : Nov 12, 2022, 4:55 PM IST

Updated : Nov 12, 2022, 5:07 PM IST

మదర్సాలో 6వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారానికి గురైంది. పాఠశాల ప్రిన్సిపల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

వివరాల్లోకి వెళితే...
గాజియాబాద్​లోని మదర్సాలో బాధిత బాలిక 6వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా బాలిక ఇంట్లో దిగాలుగా ఉంటోంది. ఆరోగ్యం సైతం క్షీణిస్తూ వచ్చింది. ఇది గమనించిన బాలిక తల్లి విషయంపై ఆరా తీయగా ప్రిన్సిపల్ దారుణం వెలుగులోకి వచ్చింది. స్కూల్​ అయిపోయిన తరువాత ప్రిన్సిపల్ శహదత్​​ మరిన్ని పాఠాలు చెప్పాల్సి ఉందని తనని ఆపేవాడని, అనంతరం అత్యాచారం చేసేవాడని బాలిక చెప్పింది. విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించేవాడని పేర్కొంది.

బాధిత బాలిక తోబుట్టువు సైతం ప్రిన్సిపల్​పై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ చేతికిస్తూ గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని తెలిపింది. ఎవరికైనా చెబుతే తన సోదరుడిని కాలువలో తోసేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ప్రిన్సిపాల్​ అఘాయిత్యం విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో తాను ధైర్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది బాలిక. దీంతో నిందితుడు శహదత్​​పై కేసు నమోదు చేశామని, అతన్ని అరెస్ట్​ చెస్తామని పోలీసులు తెలిపారు.

మంత్రాల నెపంతో వదిన హత్య:
మంత్రాల నెపంతో సొంత వదిన గొంతు కోసి హతమార్చాడో వ్యక్తి. మృతిచెందిన మహిళను లక్ష్మీభాయిగా గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. శ్రీనివాస్ శ్రీరాం అనే నిందితుడు చందానగర్​లో నివాసం ఉంటున్నాడు. ఆ సమీప ప్రాంతంలో తన సోదరుడు కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అయితే శనివారం శ్రీనివాస్​ పూటుగా మద్యం తాగి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంత్రాలు చేస్తోందన్న నెపంతో.. తన అన్న భార్యపై పదునైన ఆయుధంతో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతుకోసి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్​ శ్రీరాంను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి : లంచం ఇవ్వలేక కారుణ్య మరణానికి సిద్ధమైన దంపతులు..!

భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం.. యువతిని కిడ్నాప్ చేసి 5 రోజులు గ్యాంగ్​రేప్​

Last Updated : Nov 12, 2022, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.