ETV Bharat / bharat

'టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచండి' - భారత్​లో టీకా కార్యక్రమం

modi
మోదీ
author img

By

Published : Apr 20, 2021, 7:04 PM IST

Updated : Apr 20, 2021, 9:22 PM IST

18:50 April 20

'వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచండి'

వ్యాక్సిన్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని టీకా తయారీ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రికార్డు సమయంలో కొవిడ్​-19 టీకా డోసులను ఉత్పత్తి చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సజావుగా సాగేందుకు కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు. 

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు కరోనా వ్యాక్సిన్​ను తయారు చేస్తున్న దేశం భారత్​ అన్నారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ కార్యక్రమం మనదేశంలో జరుగుతోందన్నారు. టీకా కార్యక్రమంలో ప్రైవేట్ వైద్య రంగం క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. 

ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తామని మోదీ ప్రకటించంపై టీకా తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన  ఈ సమావేశానికి భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర, సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా సహా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, జెన్నోవా బయోఫార్మాస్యుటికల్స్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

Last Updated : Apr 20, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.