డిజిటల్, టెక్ సొల్యూషన్స్‌కు తమ ప్రభుత్వం విజయవంతంగా మార్కెట్‌ను సృష్టించిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి పథకంలో సాంకేతికతను కీలక భాగం చేసినట్లు చెప్పారు. 'టెక్నాలజీ ఫస్ట్' అనేది తమ పాలన మోడల్‌గా వెల్లడించారు.
కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ఇన్నోవేషన్ టెక్నాలజీ సొసైటీ, రాష్ట్ర విజన్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న.. బెంగళూరు టెక్ సదస్సు-2020ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోదీ.
" టెక్నాలజీ వినియోగాన్ని పెంచాం. ఒక్క క్లిక్‌తో లక్షలాది మంది రైతులు సాయం పొందారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలోని పేదలకు సరైన, సత్వర సాయం అందేందుకు సాంకేతికతే కీలక పాత్ర పోషించింది. సమాచార యుగంలో ముందుకు దూసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మన దగ్గర సాంకేతిక నిపుణులతో పాటు మంచి మార్కెట్ ఉంది. ప్రపంచం కోసం టెక్ సొల్యూషన్స్‌ను భారత్‌లో రూపకల్పన చేయాల్సిన సమయం ఇదే."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: అవి రక్షణ కాదు... భక్షణ కేంద్రాలు!