ETV Bharat / bharat

భూటాన్​లో 'రూపే' సేవలను ప్రారంభించిన మోదీ - భూటాన్​లో రుపే కార్డు రెండో దశ ప్రారంభం

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కరోనా విపత్తులో భూటాన్​కు భారత్ మద్దతుగా​ నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్​పై భరోసా కల్పించిన ప్రధాని మోదీకి.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Nov 20, 2020, 12:18 PM IST

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను.. ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​తో కలిసి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

భూటాన్​ ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపేందుకు ఇస్రో సన్నద్ధత, బీఎస్​ఎన్​ఎల్​తో మూడోదశ అంతర్జాతీయ ఇంటర్​నెట్​ గేట్​వే​ ఒప్పందం వంటి కీలక అంశాల్లో ఇరు దేశాలు సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు మోదీ.

" కొవిడ్​ విపత్తు సమయంలో భూటాన్​కు భారత్ మద్దతుగా నిలిచింది. వారికి అవసరమైన సాయం చేయటం ఎల్లప్పుడూ మనకు ప్రధానమే. ఇస్రో సాయంతో వచ్చే ఏడాది భూటాన్​ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే పనులు వేగవంతంగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం భూటాన్​కు చెందిన నలుగురు ఇంజినీర్లు డిసెంబర్​లో ఇస్రోకు వెళ్లనున్నారు. ఆ నలుగురికి నా అభినందనలు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మోదీకి కృతజ్ఞతలు..

కరోనా మహమ్మారిని నియంత్రించటంలో ప్రధాని మోదీ తన నాయకత్వాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు భూటాన్ ప్రధాని లొటాయ్​ షెరింగ్. కరోనా మహమ్మారి నుంచి భారత్​ సమర్థవంతంగా బయటపడుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ అభివృద్ధిలో భారత్​ చొరవ.. తమకు ఎంతో భరోసా ఇస్తోందన్నారు. భూటాన్​కు వ్యాక్సిన్​ అందిస్తామని భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గతేడాది ఆగస్టులో తొలిదశ..

గతేడాది ఆగస్టులో మోదీ భూటాన్​ పర్యటన సందర్భంగా.. తొలిదశ రూపే కార్డులను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలిదశ రూపే కార్డులు అమలు కావడం వల్ల.. భూటాన్​లో ఏటీఎం కేంద్రాలు, పాయింట్​ ఆఫ్​ సేల్​(పీఓఎస్​) వంటి సర్వీసులు మొదలయ్యాయి. భారత్​కు చెందిన రూపే కార్డుతో డెబిట్​, క్రెడిట్​ చెల్లింపులు సహా.. ఇ-కామర్స్​ సైట్లలో అన్నిరకాల లావాదేవీలు జరుగుతాయి.

ఇదీ చూడండి: ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.