రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పితో దిల్లీలోని ఆర్మీ ఆసుత్రిలో చేరారు కోవింద్.
వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు రాష్ట్రపతి.
కోవింద్ ఆరోగ్యంపై మోదీ ఆరా
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆయన కుమారుడికి ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేసింది ప్రధానమంత్రి కార్యాలయం.
" రాష్ట్రపతి కుమారుడికి మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. కోవింద్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. "
- ప్రధానమంత్రి కార్యాలయం