ETV Bharat / bharat

'విద్యావంతులైన యువతే విప్లవాత్మక మార్పు తేగలరు'

author img

By

Published : Mar 11, 2021, 3:55 PM IST

సమాజాన్ని మార్చే విషయంలో విద్యావంతులే శక్తివంతమైన ఏజెంట్లు అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​. దేశంలో విప్లవాత్మక మార్పులను విద్యావంతులే తీసుకురాగలరని అన్నారు. తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని.. మాట్లాడారు.

President Ram Nath Kovind views the educated as powerful agents for social change.
'విద్యావంతులైన యువతే విప్లవాత్మక మార్పులు తేగలరు'

సమాజ మార్పునకు విద్యార్థులను సంసిద్ధులను చేయటంలో చదువు కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ అన్నారు. విప్లవాత్మక మార్పులను విద్యావంతులే తీసుకురాగలరని అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

మార్పుకు విద్య ఉత్ప్రేకం వంటిది. మార్పుకు యువకులు శక్తివంతమైన ఏజెంట్​లు. దీనిని సాధించడమే నూతన జాతీయ విద్యా విధానం-2020 ప్రధాన లక్ష్యం. ప్రస్తుత అవసరాలకు తగిన పరిశోధన, నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్​లు, పోస్ట్​ గ్రాడ్యుయేట్​లు, పీహెచ్​డీల్లో కలిపి లక్ష మంది విద్యార్థులు ఉంటే అందులో 45 శాతం మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయం. ఈ రోజు గోల్డ్​ మెడల్​, మొదటి స్థాయిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 60 శాతం అమ్మాయిలే ఉండటం ఆనందాన్ని కలిగించింది. భారత్​ భవిష్యత్తును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.

-రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​

ఇదీ చూడండి: 'రక్షణ'లో ఆత్మనిర్భరం.. భారత్​కు సాధ్యమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.