ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌ను సమర్థించారు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు, పోర్చుగల్ చట్టసభ్యుడు ద్యువార్తె పషికో. భారత్... అన్ని రకాల రాజకీయ, మత సిద్ధాంతాలను గౌరవిస్తుందని.. మహిళలు, యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న పషికో.. ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత్, పోర్చుగల్ మధ్య ప్రత్యేక బంధం ఉంది. గత 500 ఏళ్లుగా ఈ బంధం కొనసాగుతోంది. ఇరు దేశాలు స్నేహితులు అని చెప్పే కన్నా సోదరులు అని చెబుతాను. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించాలన్న ప్రతిపాదనను పోర్చుగల్ సమర్థిస్తుంది.
-ద్యువార్తె పషికో, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి : జయ మరణంపై సీఎంకు స్టాలిన్ సవాల్