మధ్యప్రదేశ్(Madhya pradesh) ఛతర్‌పుర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఐదు నెలల గర్భణీ(Pregnant woman)పై అత్యాచారానికి(Rape) పాల్పడ్డారు దుండగులు. అది కూడా ఆమె పిల్లల ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
ఛతర్‌పుర్ జిల్లా బందర్ఘఢ్కు చెందిన దబంగ్ పటేల్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో బైజనాథ్ అహిర్వార్ పనిచేసేవారు. అనారోగ్య కారణాల వల్ల అతను ఒక రోజు పనికి వెళ్లలేదు. దీంతో కోపోద్రికుడైన దబంగ్.. బైజనాథ్ని, అతని సోదరుడు లఖన్ అహిర్వార్‌పై దాడి చేశాడు. భయంతో వారిద్దరూ ఊరు వదిలి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న దబంగ్..బైజనాథ్ ఇంటికి తన అనుచరులను పంపించాడు. వచ్చిన దుండగులు.. ఐదు నెలల గర్భిణీ అయిన బైజనాథ్ భార్యని.. తన పిల్లల ముందే అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన బాధితురాల్ని తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లోనే ఆమెను బంధించారు. దాదాపు నాలుగు రోజులు పాటు ఆమెకు తిండి, నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు.
కొద్ది రోజుల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Vaccination: టీకాలు ఆపాలని పిటిషన్- రూ. 50 వేలు ఫైన్!