Pregnant Elephant Died After Train Collision : రైలు ఢీకొనడం వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు తల్లి కడుపులో నుంచి పిల్ల ఏనుగు కూడా చనిపోయి బయటకు వచ్చింది. ఈ ఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. బంగాల్లోని జల్పాయ్గూఢీ జిల్లాలోని చప్రమరి వన్యప్రాణుల అభయారణ్య ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గర్భంతో ఉన్న ఓ ఏనుగు.. జరినగ్రకట, చల్సా రైల్వే జంక్షన్ల మధ్య రైల్వే లైన్ దాటుతోంది. అదే సమయంలో దల్గావ్ నుంచి సిలిగుఢీ వెళ్తున్న రైలు.. వేగంగా వచ్చి ఏనుగును ఢీ కొట్టింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాద తీవ్రవతకు పిల్ల ఏనుగు కూడా తల్లి కడుపులోంచి మరణించి బయటకు వచ్చింది.
దీనిపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం నాటికి ఏనుగుల మృతదేహాలను రైల్వే ట్రాక్ నుంచి తొలగించారు. శవపరీక్షల అనంతరం వాటిని ఖననం చేశారు. అనంతరం ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలు సాఫీగా సాగాయి. ఘటన కారణంగా అలీపుర్ద్దౌర్-సిలిగుఢీ మార్గంలో కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.
గర్భంతో ఉన్న ఏనుగును తుపాకీతో కాల్చి చంపిన గ్రామస్థులు.. కడుపులోని మగ పిండం మృతి..
Pregnant Elephant Shot Died : కొద్ది రోజుల క్రితం 10 నెలల గర్భంతో ఉన్న ఏనుగును తుపాకీతో కాల్చి చంపిన ఘటన కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది. ఆహార అన్వేషణలో భాగంగా అడవి నుంచి వచ్చిన 20 ఏళ్ల ఏనుగును రసూల్‌పుర్, బాలుగోడు ప్రాంతంలో ఆగంతకులు కాల్చి చంపారు. రసూల్‌పుర్, బాలుగోడు ప్రాంతాల్లో ఆహారం కోసం ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తుంటాయి. ప్రజలపై దాడులు చేసిన సంఘటనలు కూడా వెలుగులో వచ్చాయి. దీంతో రైతులు, అటవీశాఖ అధికారులు కలిసి సోలార్ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. కంచె నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అడవి ఏనుగులు పొలాలు, తోటల్లోకి సులభంగా ప్రవేశించాయి. ఈ క్రమంలోనే కాఫీ తోటలోకి ప్రవేశించిన ఏనుగును కాల్చి చంపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9ఏళ్ల బాలికపై ఎద్దు భీకర దాడి.. కొమ్ములతో పైకిలేపి.. ఒక్కసారిగా కిందకు విసిరేసి..
బావిలో పడ్డ భారీ అడవి దున్న.. మత్తుమందు ఇచ్చి.. క్రేన్ సహాయంతో..