ETV Bharat / bharat

Pragyan Vikram Names to Babies : పిల్లలకు విక్రమ్, ప్రగ్యాన్​ పేర్లు పెట్టిన తల్లిదండ్రులు.. చంద్రయాన్​ 3 విజయానికి గుర్తుగా..

Pragyan Vikram Names to Babies : చంద్రయాన్ 3 ప్రయోగానికి గుర్తుగా.. అందులో కీలక పాత్ర పోషిస్తున్న 'ల్యాండర్​ విక్రమ్', రోవర్ ప్రగ్యాన్​' ​ పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు. కర్ణాటకు చెందిన ఈ దంపతుల జంటలు.. ఈ తరహాలో ఇస్రోకు అభినందనలు తెలిపారు.

pragyan-vikram-names-to-new-born-babys-karnataka-parents-named-their-new-born-babies-as-vikram-and-pragyan
పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్ అని పేర్లు పెట్టిన తల్లిదండ్రులు
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 9:55 PM IST

Updated : Aug 26, 2023, 10:51 PM IST

Pragyan Vikram Names to Babies : చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన వేళ.. అందులోని ల్యాండర్​ విక్రమ్​, రోవర్​ ప్రగ్యాన్​ పేర్లను తమకు పుట్టిన పిల్లలకు పెట్టుకున్నారు దంపతులు. ఇస్రో జరిపిన చంద్రయాన్ 3 ప్రయోగ విజయానికి గుర్తుగా ఇలా తమ పిల్లలకు పేర్లు పెట్టుకుని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపాయి కర్ణాటకకు చెందిన రెండు జంటలు.

ఇదీ జరిగింది
వడేగరా ప్రాంతంలో నివాసం ఉండే బాలప్ప-నాగమ్మ, నింగప్ప-శివమ్మ దంపతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు తమ చిన్నారులకు విక్రమ్, ప్రగ్యాన్​ అనే పేర్లు పెట్టాకున్నారు. బాలప్ప-నాగమ్మ దంపతులు తమ చిన్నారికి 'విక్రమ్​' అని పేరు పెట్టుకోగా.. నింగప్ప-శివమ్మ వారి శిశువుకు 'ప్రగ్యాన్​'గా నామకరణం చేశారు. చిన్నారి విక్రమ్ జూన్​ 28న జన్మించగా.. ఆగస్టు 14న ప్రగ్యాన్​ పురుడు పోసుకున్నాడు. వీరిద్దరికి ఆగస్టు 24న ఒకేసారి నామకరణ వేడుకులు నిర్వహించి ఈ పేర్లు పెట్టారు. విక్రమ్​ అబ్బాయని, ప్రగ్యాన్​ అమ్మాయని వారు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Chandrayaan 3 Latest News : చంద్రయాన్ 3 ప్రయోగం విజయంవంతమైన వేళ.. ఇస్రోకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపామని చిన్నారులు తల్లిదండ్రులు తెలిపారు. ఈ చారిత్రక విజయానికి గుర్తుగానే తమ చిన్నారులకు రోవర్​, ప్రజ్ఞాన్ పేర్లు పెట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ దంపతుల జంటలు.. చంద్రయాన్ ప్రయోగ సమయంలోనే తమ పిల్లలు జన్మించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Chandrayaan 3 Successfully Landed On Moon : ఆగస్టు 23 సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్ 3 విక్రమ్​ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్​ ల్యాండింగ్​ అయింది. 17 నిమిషాలపాటు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో భూమిపై నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండానే ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్- ALS కమాండ్‌తో సాఫ్ట్​ ల్యాండింగ్ అయింది. అనంతరం విక్రమ్​ ల్యాండర్​ చంద్రుడి ఉపరితలం మొదటి ఫొటోను పంపింది. కొన్ని గంటల తర్వాత ల్యాండర్​ నుంచి ప్రగ్యాన్ రోవర్​ బయటకు వచ్చి తన పని మొదలు పెట్టింది.

Chandrayaan 3 Name to Babies : జాబిల్లిపైకి 'భారత్'.. అప్పుడే పుట్టిన పిల్లలకు 'చంద్రయాన్​'గా నామకరణం!

Chandrayaan 3 Landing Success Wishes : చంద్రయాన్-3 సక్సెస్​తో నా జీవితం ధన్యమైంది : ప్రధాని మోదీ

Last Updated : Aug 26, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.