వచ్చే ఆదివారం జరగబోయే నీట్ పరీక్షను(NEET exam date 2021) వాయిదా వేయాలని(NEET exam postpone) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.
సెప్టెంబరు 12న జరిగే నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది (NEET exam controversy). అదే రోజున 12వ తరగతి ఇంప్రూవ్‌మెంట్/కంపార్ట్‌మెంట్ పరీక్షలు ఉన్నందున నీట్‌ను వాయిదా వేయాలని పలువురు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నీట్ జాతీయ స్థాయి పరీక్షలు కావడంతో దాంట్లో జోక్యం చేసుకోవడం సబబు కాదని, ఒక్కశాతం మందికోసం మొత్తం వ్యవస్థను ఆపలేమని కోర్టు అభిప్రాయపడింది.
ఈ పరిణామాలపై నేడు ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం చూడట్లేదు. నీట్‌ను వాయిదా వేయండి. వారికి న్యాయమైన అవకాశం కల్పించండి" అని ట్వీట్ చేశారు.
-
GOI is blind to students’ distress.
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Postpone #NEET exam. Let them have a fair chance.
">GOI is blind to students’ distress.
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2021
Postpone #NEET exam. Let them have a fair chance.GOI is blind to students’ distress.
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2021
Postpone #NEET exam. Let them have a fair chance.
ఇదీ చదవండి: నీట్ వాయిదాకు సుప్రీం నో- షెడ్యూల్ ప్రకారమే పరీక్ష