దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, విశ్వవిద్యాలయాల్లో మే నెలలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖెహార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆన్లైన్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేసింది కేంద్రం.
"ఆన్లైన్ తరహా పరీక్షలు కొనసాగవచ్చు. ఈ నిర్ణయంపై జూన్ మొదటి వారంలో సమీక్షిస్తాం. సంస్థలో ఎవరికైనా సాయం అవసరమైతే.. తక్షణమే సాధ్యమైనంత సహాయం అందించాలి. అర్హులైన వారు టీకా వేయించుకోవాలి. కరోనా బారిన పడకుండ తగిన జాగ్రత్తలు పాటించాలి" అని అమిత్ ఖెహార్ సూచించారు.
ఇదీ చూడండి: వధువు డబుల్ ధమాకా.. పెళ్లి రోజే ఎన్నికల్లో విజయం