మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పేరు మీద పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది తపాలాశాఖ. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భర్తను భుజాలపై ఊరేగించినందుకు గౌరవార్థంగా ఇలా ప్రత్యేక స్టాంప్‌ను అందించింది.
ఎన్నికల్లో గెలుపుతో..
పుణె జిల్లా పాలూ గ్రామానికి చెందిన ఆ మహిళ పేరు రేణుకా గురవ్. పంచాయతీ ఎన్నికల్లో ఆమె భర్త సంతోష్ గురవ్ భారీ మెజార్టీతో గెలిచాడు. పట్టలేని ఆనందంలో మునిగిపోయింది రేణుకా. భర్తను భుజాలపై మోస్తూ ఊరంతా తిప్పింది. గ్రామస్థులూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ప్రశంసించారు కూడా.
ప్రతి మహిళా ఇంటికే పరిమితం కాకుండా భర్తతో పాటు గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాలంటోంది రేణుక. అందుకే తన భర్త గెలవగానే అతన్ని భుజాలపై ఊరేగిస్తూ సందేశమిచ్చినట్టు తెలిపింది.
"మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి కూడా వారికి అవకాశం ఇవ్వరు. అయితే కుటుంబ అభివృద్ధిలో వారిదే ప్రధాన పాత్ర. సమాజ సేవలో వారు పాల్గొనరు. అందుకు వారిపై ఉన్న ఆంక్షలే కారణం. ప్రతి మహిళా ఇంటికే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికోసం పాటు పడాలనేదే నా ఆకాంక్ష. ప్రతి మహిళా.. బయటికొచ్చి భర్తతో కలిసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలనే నా భర్తను భుజాలపై ఊరేగించాను."
-రేణుకా గురవ్, పాలూ గ్రామస్థురాలు.
తన భార్య పేరు మీద తపాలా శాఖ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు సంతోష్ గురవ్.
"నన్ను భుజాలపై ఊరేగించినందుకు నా భార్యను అందరూ ప్రశంసిస్తున్నారు. తనకి ఎలా కృతజ్ఞతలు తెలపాలో అర్థంకావడం లేదు."
-సంతోష్ గురవ్, పాలూ గ్రామస్థుడు.
ఇదీ చూడండి: 'భారత్-చైనా మైత్రి పునరుద్ధరణకు 8 సూత్రాలు'