ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు స్కూలు ఎప్పటిలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది. అయిదో తరగతి విద్యార్థులకు క్లాసు ప్రారంభమైన కొంతసేపటికే పోర్న్ వీడియో ప్లే అయింది. దీంతో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని రాజ్‌గురునగర్‌లో శుక్రవారం జరిగింది.
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. పిల్లలకు యాజమాన్యం పంపిన లాగిన్ వివరాలను ఎవరో బయటి వాళ్లకు షేర్ చేసి ఉంటారని, వారే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును సైబర్ దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా ఆర్-ఫ్యాక్టర్!