ETV Bharat / bharat

భర్త మృతితో చెదిరిన కల.. నిలువ నీడలేక కష్టాల కడలిలో ఎదురీత

author img

By

Published : Feb 2, 2022, 2:29 PM IST

Rudraprayag woman: ప్రకృతి విపత్తు ఓ మహిళను కష్టాల కడలిలోకి నెట్టింది. ఇద్దరు పిల్లలున్న ఆమెకు నివాసం లేకుండా చేసింది. ఆశ్రయం కల్పించాలని అందరినీ వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో వర్షాలకు దెబ్బతిని శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే ఆమె నివాసముంటోంది. ఎవరైనా ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తోంది.

Woman living in broken house
ప్రకృతి విపత్తుతో మహిళకు కష్టాలు.. కూలిన ఇంట్లోనే జీవనం

Woman living in broken house: ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్​లోని కమ్​సాల్​కు చెందిన 28 ఏళ్ల పూనం దేవి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి విపత్తే ఆమెకు నిలువు నీడ లేకుండా చేసింది. భారీ వర్షాల కారణంగా ఇల్లు పూర్తిగా దెబ్బతిని నిరాశ్రయురాలైంది. గత్యంతరం లేక శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే ఇద్దరు పిల్లలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.

భారీ వర్షాల కారణంగా పూనం దేవి ఇల్లు జనవరి 6న కూలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇతరులు ఆశ్రయం కల్పించారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేక ఆమె మళ్లీ కూలిపోయిన ఇంట్లోకే తిరిగివచ్చింది. గోడకు పగుళ్లు, పైకప్పు లేక ఇల్లు శిథిలావస్థలో ఉంది. వేరే గత్యంతరం లేక ఇంటిపై ప్లాస్టిక్ కవర్​ను కప్పి ఇద్దరు పిల్లలతో కలిసి అందులోనే జివిస్తోంది. ఉదయం వేళ చలి, రాత్రి వేళ వన్యప్రాణులు ఏమైనా వస్తాయనే భయంతో రోజూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.

Rudraprayag news

క్యాన్సర్​తో భర్త మృతి..

క్లీనర్​గా పని చేసే పూనం దేవి భర్త ధర్మేంద్ర రాణా.. ఏడేళ్ల క్రితం క్యాన్సర్​తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. దంపతులు కూడ బెట్టుకున్న డబ్బంతా చికిత్సకే ఖర్చయింది. భర్త మరణం తర్వాత పూనందేవికి కష్టాలు మొదలయ్యాయి. నాలుగేళ్ల క్రితం పూనందేవి మామ కూడా కుటుంబం నుంచి వేరుపడ్డాడు. దీంతో ఆమె ఒంటరై కష్టాల చట్రంలో చిక్కుకుపోయింది. తనకు సాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. రేషన్ కార్డు కూడా అత్తామామల పేరు మీద ఉన్నందున దాని ప్రయోజనం ఆమె పొందలేకోపోతోంది.

Woman living in broken house
ఇద్దరు పిల్లలతో పూనం దేవి

Rudraprayag woman

గతంలో తన కుమారుడి సంక్షేమం కోసం సాయంగా అందేవని, ఇప్పుడు దాన్ని కూడా నిలిపివేశారని పూనం దేవి చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ లేని వారికే ఆ సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతినెల వచ్చే వితంతు పెన్షన్​ రూ.1000తోనే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సాయం అందిస్తారని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే పూనం దేవి పేరు ప్రధానమంత్రి ఆవాస్​ యోజన అర్హుల జాబితాలో ఉందని, ఇల్లు ఎప్పుడు మంజూరు అవుతుందో చెప్పలేమని గ్రామ పెద్ద తెలిపారు. తమకు చేతనైన సాయం ఆమెకు అందిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కావాలని పూనం దేవి ఎప్పుడూ అడగలేదని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: అక్కాచెల్లెళ్లపై ఏడాదిగా అత్యాచారం.. తండ్రిని చంపేస్తామని బెదిరించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.