దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి(by election 2021). కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు(by election in india). ఓటేసేందుకు వృద్ధులు కూడా తరలివెళుతున్నారు. కాగా పలు ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేసినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినట్టు వెల్లడించింది.
కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలోని 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:- నీరోడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి