ETV Bharat / bharat

కేరళ రాజకీయం.. వివాదాల మయం

కేరళ శాసనసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పార్టీల నిందారోపణలతో రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు నేతలు. నకిలీ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ చేస్తూ.. కేరళ హైకోర్టులో విపక్ష నేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు వివరణ కోరింది. మరోవైపు ప్రజాప్రతినిధులపై జరుగుతోన్న ఐటీ దాడులను ఖండించిన సీఎం.. దాడులపై న్యాయవిచారణకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.

poll disputes in kerala political heat across the state
కేరళ రాజకీయం.. వివాదాల మయం
author img

By

Published : Mar 27, 2021, 7:02 PM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. అధికార-ప్రతిపక్షాలు ఆరోపణలు-ప్రత్యారోపణల మధ్య త్వరలో జరిగే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. కేరళలో బోగస్‌ ఓట్లను సృష్టించి విజయం సాధించాలని అధికార కూటమి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమను అభాసుపాలు చేసేందుకు యూడీఎఫ్‌, భాజపా ప్రయత్నిస్తున్నట్లు ఎల్​డీఎఫ్ ఆరోపిస్తుంది. నకిలీ ఓట్లు, ఐటీ, ఈడీ దాడుల మధ్య కేరళ రాజకీయం మునుపెన్నడూ లేనంత రక్తికట్టిస్తున్నాయి.

నకిలీ ఓట్లు..

కేరళలో ఎక్కువ సంఖ్యలో.. నకిలీ ఓట్లను సృష్టించి అధికార ఎల్​డీఎఫ్​ విజయం సాధించాలని చూస్తోందని.. ప్రతిపక్ష కాంగ్రెస్‌-యూడీఎఫ్​ కూటమి ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలు కలిపి 4 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు విపక్ష కాంగ్రెస్‌, యూడీఎఫ్​ కూటమి హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. విపక్ష నేత రమేశ్‌ చెన్నితాల దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో.. నకిలీ ఓట్ల ద్వారా అధికార ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారం చేపట్టేలా ప్రభుత్వ ఉన్నాతాధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నకిలీ ఓట్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అధికార ఎల్‌డీఎఫ్‌ ఖండించింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: 'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'

ఇదీ చదవండి: కేరళలో కామ్రేడ్ల నోట శబరిమల మాట

ఇదీ చదవండి: 'కేంద్రం విధ్వంసకాండలో తలారిలా కాంగ్రెస్'

ఐటీ దాడులు..

మరోవైపు అధికార ఎల్‌డీఎఫ్‌కి చెందిన ప్రజా ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు(కేఐఐఎఫ్​బీ)పై ఐటీ దాడులు జరగటం తీవ్ర దుమారం రేపింది. దాడులను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గురువారం తిరువనంతపురంలోని కేఐఐఎఫ్​బీ కేంద్ర కార్యాలయంపై ఐటీ అధికారులు దాడి చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందాలను పావులుగా వాడుతున్నారని ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ బహిరంగ విమర్శలు చేశారు. దాడులపై న్యాయవిచారణకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన కేరళ క్యాబినేట్‌.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కేవీ మోహనన్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

యూడీఎఫ్‌ నోట భాజపా స్వరం వినిపిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు బదులు పార్టీలు నిందారోపణలకే ఎక్కువ సమయం కేటాయించడం ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి: కేరళలో బరిలోకి 'స్టార్​ కిడ్స్'​- వారసత్వం నిలిచేనా?

'సిద్ధాంతాలపై ఆ పార్టీల్లో గందరగోళం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.