ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: రాజకీయ సిద్ధాంతాల్ని మరచిన నేతలు! - మమతా బెనర్జీ

పశ్చిమ్​ బంగాలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచార తీరులో మాత్రం 2016ను తలపించినప్పటికీ.. కీలకమైన అభివృద్ధి అంశం వంటి పలు ప్రధాన సమస్యలు పక్కదారి పట్టాయని విద్యావేత్తలు అంటున్నారు. ఎప్పటిలా ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి, శాంతి భద్రతలపై చర్చ జరగట్లేదని, అభ్యర్థులు.. రాజకీయ పార్టీలను మార్చే ధోరణి చికాకు తెప్పిస్తోందని చెబుతున్నారు. దూరదృష్టిలేని రాజకీయాలతో అల్పమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.

Poll-bound West Bengal reflects political bankruptcy
బంగాల్​ దంగల్​: రాజకీయ సిద్ధాంతాల్ని మరచిన నేతలు!
author img

By

Published : Mar 16, 2021, 6:50 PM IST

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్​ కీలకం. ఇప్పటికే అక్కడ ప్రచార పర్వం ఊపందుకుంది. అధికార తృణమూల్​ కాంగ్రెస్​తో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది భాజపా. తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఎన్నికలకు ముందు చాలా వరకు అంశాలు 2016 పరిస్థితిని గుర్తుకుతెస్తున్నాయి. కానీ.. ఓ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, శాంతిభద్రతలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఇతరత్రా అంశాలేవీ చర్చకు రావట్లేదు.

ఈ సాధారణ అంశాలు వెనక్కి వెళ్లిపోయిందనేందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఊహించని రీతిలో రాజకీయ నేతలు పార్టీలు మారడం ప్రధాన కారణం. ఇదే మిగతావాటి నుంచి దృష్టిని మళ్లించింది. ఇంకా.. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఎక్కువైంది. ఈ ప్రస్తుత పరిస్థితి.. 'రాజకీయ దివాలా'కు ఏ మాత్రం తీసిపోదని అభిప్రాయపడుతున్నారు విద్యావేత్తలు, రాజకీయ మేధావులు. ఇది తమకు ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

రాజకీయ లోటు స్పష్టం..

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న స్థితి.. రాజకీయ నేతల సైద్ధాంతిక ఆలోచనా పరిజ్ఞానం లోటుకు నిదర్శనమని ప్రఖ్యాత విశ్లేషకులు, ప్రెసిడెన్సీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్​ డా. అమోల్​ కుమార్​ ముఖోపాధ్యాయ్​ అభిప్రాయపడుతున్నారు.

BENGAL ELECTIONS
డా. అమోల్​ కుమార్​ ముఖోపాధ్యాయ్​

''ఏ ఒక్కరూ అర్థవంతమైన రాజకీయ చర్చలో పాల్గొనట్లేదు. ఏ ఒక్కరూ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. ప్రతీ బహిరంగ సభా.. అస్పష్టమైన అబద్ధాలు, అబ్బురపరిచే నాటక ప్రదర్శనల నడుమ సాగుతోంది. ఈ నంబర్ల ఆట కలగూరగంపలా ఉంది.''

- డా. అమోల్​ కుమార్​, రాజకీయ విశ్లేషకులు

'పార్టీలు మారేది అందుకే..'

రాజకీయ నేతలు వేగంగా నిమిష నిమిషానికీ పార్టీలు మారే ధోరణిపైనా విరుచుకుపడ్డారు డా. ముఖోపాధ్యాయ్​. దీనికి కారణం టికెట్లు నిరాకరించడమో, లేదా తాము పాల్పడిన ఆర్థిక మోసాలకు సంబంధించి శిక్ష నుంచి తప్పించుకోవడమో అయ్యుంటుందని అంటున్నారు.

ఇవీ చూడండి: బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం

కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

''దినేశ్​ త్రివేది, రాజీవ్​ బందోపాధ్యాయ్​, ప్రొబీర్​ గోశల్​ వంటి నేతలు మాత్రమే.. నైతికంగా, మనస్సాక్షిగా తృణమూల్​ను వీడి భాజపాలో చేరారు. మిగతా వారు టికెట్లు ఇవ్వనందుకో, తాము చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకో శిబిరాల్ని మార్చారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. అలాంటి నేతలు బంగాల్​కు, బంగాలీ ప్రజలకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగానూ చెడ్డ పేరు తెచ్చారు.''

'గ్లామర్​ పనిచేయదు'

ప్రస్తుత బంగాల్​ రాజకీయాల్లో 'గ్లామర్​ మంత్రం'పైనా మాట్లాడారు అమోల్​. చాలామంది ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదని, నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​తో 'టాలీవుడ్'లో చీలిక!

''భాజపా లోక్​సభ సభ్యురాలు లాకెట్​ ఛటర్జీ మినహా.. ఇటీవల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సెలబ్రిటీలు ఎవ్వరూ తమ బాధ్యతను తీవ్రంగా పరిగణించడం లేదు. కొత్తగా ఆయా పార్టీల్లో చేరికైన సినీ రంగానికి చెందిన కొందరు ఈసారీ గెలవొచ్చు. కానీ.. వారు తమ కర్తవ్యాన్ని తీవ్రంగా పరిగణిస్తారనేది సందేహమే.''

- డా. అమోల్​ కుమార్​

ఆర్థిక శాస్త్ర మాజీ ఆచార్యులు, విద్యావేత్త ప్రొబీర్​ కుమార్​ ముఖోపాధ్యాయ్​ కూడా.. డా. అమోల్​ కుమార్​ అభిప్రాయాల్ని సమర్థించారు. అల్పమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ పోతే.. రాజకీయాలు అర్థరహితంగా మారతాయని, దూరదృష్టి లేకుండా పోతాయని అంటున్నారు.

political bankruptcy
ప్రొబీర్​ కుమార్​

ఇదీ చూడండి: నందిగ్రామ్​ నుంచే దీదీ సై.. మరి సువేందు?

''మొదట అనువ్రతా మొండల్​.. ఖేలా హోబే( ఆట ఆడదాం) అన్నారు. ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ కూడా బహిరంగ సమావేశాల వేదికగా అదే చెబుతున్నారు. గతంలో.. ఇలాంటి వాటికి ఆమడ దూరంలో ఉండే వామపక్షాలు(సీపీఎం) కూడా 'తుంపా సోనా' అంటూ నినదిస్తున్నాయి. కానీ దీంతో ఏమవుతుంది? ఇలాంటి దూరదృష్టి, ముందుచూపు లేని రాజకీయాలతో.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరగదనేది సాధారణ విషయం. ప్రస్తుత నాయకులు.. రాజకీయం పదాన్ని అపహాస్యం చేశారు.''

- ప్రొబీర్​ కుమార్​, విద్యావేత్త

'అది జరగిందే మంచిదైంది'

ఇలా అల్పవిషయాలకు ప్రాధాన్యం ఇస్తూ పోతే.. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల మాటేంటని ఆరోపించారు ప్రొబీర్​. పార్టీలు మారడంపైనా తన వైఖరిని వెలిబుచ్చారు.

ఇదీ చూడండి: మమత స్థానచలనం వెనక మతలబేంటి?

''కొద్ది రోజుల క్రితం వరకు కోల్​కతా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీ, ఆయన స్నేహితుడు బైశాఖీ బందోపాధ్యాయ్​.. భాజపా తరఫున విస్తృతంగా రోడ్​షోలు నిర్వహించారు. కానీ ఆయనకు బెహాలా​(తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్​ నిరాకరించింది అధిష్ఠానం. వెంటనే భాజపాకు రాజీనామా చేశారు. బైశాఖీది అదే బాట.

ఛటర్జీకి టికెట్​ ఇవ్వకపోవడం వల్ల కాస్త మంచే జరిగింది. ఈ స్థానంలో సోవన్​ మాజీ భార్య రత్నా ఛటోపాధ్యాయ్​ని బరిలోకి దింపింది తృణమూల్​. ఒకవేళ సోవన్​ ఛటర్జీని భాజపా అభ్యర్థిగా ప్రకటిస్తే.. అక్కడి రాజకీయ డ్రామాను ఊహించుకోవాలంటేనే భయమేస్తోంది.''

- ప్రొబీర్​ కుమార్​, విద్యావేత్త

ఇవీ చూడండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

'మమతా బెనర్జీ కాలికి గాయం- దాడే కారణం!'

బంగాల్​లో భాజపా పక్కా స్కెచ్​.. 109 స్థానాల్లో ట్రబుల్​ షూటర్స్​

బంగాల్​ దంగల్​: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!

'గాయపడిన పులి మరింత ప్రమాదకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.