ETV Bharat / bharat

విచారణకు సహకరించకుంటే నిందితుడి బెయిల్‌ రద్దు! - అమికస్‌క్యూరీ

ఎంపీలు, ఎమ్మెల్యేలపై వ్యాజ్యాల విచారణ వేగంగా సాగేందుకు సుప్రీంకోర్టు(Supreme court) సహాయకుడు(అమికస్‌క్యూరీ) పలు సూచనలు చేశారు. ఈడీ, సీబీఐ దర్యాప్తుల్లో జాప్యం నివారణకు పరిశీలక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కేసు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో న్యాయస్థానానికి నివేదిక అందిచాలని సూచించారు

sc amicus curaie
అమికస్‌క్యూరీ
author img

By

Published : Aug 25, 2021, 8:12 AM IST

ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ విభాగాలు నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యం నివారణకు సుప్రీంకోర్టు సహాయకుడు(అమికస్‌క్యూరీ), సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. దిగువ కోర్టుల్లోనూ, దర్యాప్తు సంస్థల విధుల నిర్వహణలోనూ జరుగుతున్న ఆలస్యానికి సహేతుకమైన కారణాలు ఉంటున్నాయా, ఒకవేళ ఉంటే వాటిని సత్వరమే సరిచేసి విచారణలను వేగిరపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటివి వాటిలో ఉన్నాయి.

న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనానికి హన్సారియా నివేదిక సమర్పించారు. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది.

అమికస్‌ క్యూరీ ఏం చెప్పారంటే

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న కేసుల్లో ఈడీ, సీబీఐ విభాగాల దర్యాప్తు పూర్తయి వాటి విచారణ ట్రయల్‌ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లయితే రోజువారీగా వాటిని చేపట్టాలని ఆదేశించాలి.
  • ప్రజాప్రతినిధుల కేసులకు అధిక ప్రాధాన్యమిచ్చి విచారణలు త్వరగా ముగించేలా దిగువ కోర్టులకు హైకోర్టులు పరిపాలనాపరమైన ఆదేశాలివ్వాలి.
  • ఒకవేళ నిందితులు విచారణకు సహకరించకుంటే వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేసే విషయాన్ని ట్రయల్‌కోర్టు పరిశీలించాలి.
  • హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా జారీ చేయదలిస్తే నిర్ణీత కాల పరిధిని నిర్ణయించాలి. ఆ వ్యవధి ముగిసిన తర్వాత ట్రయల్‌ కోర్టులు విచారణలను కొనసాగించేలా ఆదేశాలివ్వాలి.
  • సీబీఐ, ఈడీ విభాగాల దర్యాప్తుల్లో కాలహరణను నివారించేందుకు పరిశీలక (మోనిటరింగ్‌) కమిటీని నియమించాలి. ఆ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించాలి. ఈడీ, సీబీఐల నుంచి ఒక్కో డైరెక్టర్‌, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి, జిల్లా జడ్జి స్థాయి న్యాయాధికారిని సభ్యులుగా నియమించాలి. దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలుసుకొని, దర్యాప్తు అధికారికి తగిన ఆదేశాలు, సూచనలను కమిటీ చేయాలి.
  • పరిశీలక కమిటీ ప్రతి కేసుపైనా సమావేశమైన రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు సీల్డ్‌కవర్‌లో నివేదిక పంపించాలి.

ప్రజాప్రతినిధులపై వివిధ హైకోర్టుల్లో ఉన్న కేసుల స్థితిగతులపైనా విజయ్‌ హన్సరాజ్‌ నివేదికను సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందజేశారు.

మనీలాండరింగ్‌ కేసుల్లో 120 మంది ప్రజాప్రతినిధులపై దర్యాప్తు

నగదు అక్రమ చెలామణి(మనీలాండరింగ్‌) కేసుల్లో నిందితులుగా ఉన్న 120 మందికిపైగా ప్రజాప్రతినిధులపై ఈడీ దర్యాప్తు జరిపింది. వారిలో 51 మంది సిట్టింగ్‌, మాజీ ఎంపీలు. 28 కేసుల్లో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ట్రయల్‌ కోర్టుల్లో అభియోగాల నమోదు దశలో 10 కేసులు ఉన్నాయని న్యాయవాది స్నేహ కాలిటా ద్వారా విజయ్‌ హన్సరాజ్‌ మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇవికాక సీబీఐ నమోదు చేసిన మరో 121 క్రిమినల్‌ కేసుల్లో.. 37 కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉంది.

  • 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లకు సంబంధించి 77 కేసులను ఎలాంటి కారణం తెలపకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కర్ణాటక-62, తమిళనాడు-4, తెలంగాణ-14, కేరళ ప్రభుత్వం 36 కేసులను కారణాలు తెలపకుండానే రద్దు చేశాయని సుప్రీం ధర్మాసనానికి నివేదికలో వివరించారు.

ఇదీ చదవండి: Supreme Court: 'ఓబీసీలోని సంపన్న వర్గాలను అలా నిర్ధరించడం తప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.