Political leaders Condolence to Senior Actor Chandramohan : హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి తరలించారు. భౌతికకాయాన్ని నేడు, రేపు ఇంట్లోనే ఉంచనున్న కుటుంబసభ్యులు.. సోమవారం మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి రావాల్సి ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
CM KCR TRIBUTE TO CHANDRAMOHAN : ఇదిలా ఉండగా.. చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటన, దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం... తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ స్ఫూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. శోకతప్తులైన చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని సీఎం…
">ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2023
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని సీఎం…ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2023
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని సీఎం…
చంద్రమోహన్ - 1000 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!
-
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
చంద్రమోహన్ మరణం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డును అందుకున్న ఆయన.. తెలుగు, తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నాటి చిత్రాలు మొదలుకొని, నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిదని కొనియాడారు.
-
ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/UrH5WGIE7L
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/UrH5WGIE7L
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) November 11, 2023ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/UrH5WGIE7L
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) November 11, 2023
హీరో, విలన్ - పాత్ర ఏదైనా అందులో లీనం - ఆ సినిమానే ఉదాహరణ!
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి చెందారన్న వార్త తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నానన్న ఆయన.. కుటుంబ కథా చిత్రాలంటే చంద్రమోహన్ అన్నట్లుగా సాగిన వారి సినీ ప్రస్థానం యువ నటీనటులకు ఆదర్శమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!
చంద్రమోహన్ మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటన్నారు. మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు. పౌరాణిక, కుటుంబ చిత్రాలతో చంద్రమోహన్ అలరించారని బాలయ్య గుర్తు చేసుకోగా.. చంద్రమోహన్ తన నటనతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని లోకేశ్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
సీనియర్ నటులు చంద్రమోహన్ గారి మృతి బాధాకరం. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల… pic.twitter.com/ilKNoPhAfE
— Lokesh Nara (@naralokesh) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">సీనియర్ నటులు చంద్రమోహన్ గారి మృతి బాధాకరం. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల… pic.twitter.com/ilKNoPhAfE
— Lokesh Nara (@naralokesh) November 11, 2023సీనియర్ నటులు చంద్రమోహన్ గారి మృతి బాధాకరం. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల… pic.twitter.com/ilKNoPhAfE
— Lokesh Nara (@naralokesh) November 11, 2023