ETV Bharat / bharat

బంగాల్‌లో ఫిరాయింపుల జోరు- పరస్పర నిందారోపణలు - బంగాల్​ పోలిటికల్​ వార్తలు

మరికొన్ని నెలల్లో బంగాల్​ శాసనసభ ఎన్నికలు జరుగనున్న వేళ ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. విలువలే ప్రామాణికంగా నడిచిన చోట.. ఈ విపరీత సంస్కృతిని అక్కున చేర్చుకుంటున్నారు నాయకులు. తప్పిదం ఏవరిదైనా..అధికార, విపక్ష పార్టీలు పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి.

political game changes in bengal due to party jumping leaders
బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!
author img

By

Published : Dec 23, 2020, 5:37 PM IST

సిద్ధాంతాలే ప్రాతిపదికగా రాజకీయాలను నడిపించిన నేల అది... పార్టీ ఫిరాయింపులను అనైతిక చర్యగా ఛీత్కరించిన రాష్ట్రమది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది! ఆయారాం గయారాం సంస్కృతికి పశ్చిమ బెంగాల్‌ ఓ కేంద్రంగా మారింది. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న వేళ ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తప్పిదం ఎవరిదనే విషయంలో అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2011కు ముందు, తర్వాత పరిస్థితులపై రాజకీయంగా తీవ్ర చర్చే జరుగుతోంది. అధికార పగ్గాలు టీఎంసీ చేతికి వచ్చాక కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నామనే పేరుతో సొంత గూళ్లను వీడారు. గత పదేళ్లలో 40 మంది వరకూ విపక్ష ఎమ్మెల్యేలను టీఎంసీ తన వైపునకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు అదే ఫిరాయింపుల బెడదను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో భాజపా 18 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన తర్వాత టీఎంసీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి కమలం పార్టీలో చేరారు. గత శనివారం మేదినీపుర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి సువేందు అధికారి సహా అయిదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 34 మంది ఇతర నాయకులు ఒకేసారి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఒక్కసారిగా ఇంతపెద్ద సంఖ్యలో నేతలు టీఎంసీని వీడిపోవటం ఇదే ప్రథమమని అంటున్నారు. కమలనాథుల చర్యకు ప్రతీకారం తీర్చుకునేలా తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా వెంటనే స్పందించింది. భాజపా ఎంపీ, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ను పార్టీలో చేర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ నాయకుల, కార్యకర్తల ఫిరాయింపులు ఇంకా అధికం కానున్నాయని తెలుస్తోంది.

కేబినెట్‌ భేటీకి నలుగురు గైర్హాజరు

పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి నలుగురు మంత్రులు గైర్హాజరు కావటం చర్చనీయాంశమయ్యింది. అటవీ మంత్రి రజిబ్‌ బెనర్జీ పార్టీ మారుతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి.

ఇవీ చూడండి:

'అభివృద్ధిలో బంగాల్​ టాప్​.. ఇవిగో ఆధారాలు'

200 రాకపోతే తప్పుకుంటారా?: ప్రశాంత్​ సవాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.