ETV Bharat / bharat

సీఎం రేవంత్​కు శుభాకాంక్షల వెల్లువ - రాష్ట్ర ప్రగతికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్న ప్రధాని మోదీ - రేవంత్​కు గవర్నర్ తమిళిపై శుభాకాంక్షలు

Political Celebrities Wishes to CM Revanth Reddy : రేవంత్‌ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై, రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం జగన్‌, చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరీశ్‌రావు, నారా లోకేశ్‌ సహా పలువురు కొత్త సర్కార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆకాంక్షించారు.

Celebrities Wishes to CM Revanth Reddy
Political Celebrities Wishes to CM Revanth Reddy
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 6:04 PM IST

Updated : Dec 7, 2023, 6:21 PM IST

Political Celebrities Wishes to CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పాలన విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు.

అన్ని విధాలా తోడ్పాటు: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ బాటలో అన్ని విధాలా అభివృద్ధి చేసి, గొప్ప విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

  • తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula

    — Narendra Modi (@narendramodi) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు - సీఎం తొలి సంతకం దానిపైనే!

  • తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం ఫరిడవిల్లాలి: తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. ప్రజల ఆకాంక్షాల మేరకు పని చేయాలని తెలిపారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు.

  • తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అన్ని పక్షాలను కలుపుకొని వెళ్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగించగలరని ఆకాంక్షిస్తున్నాను. pic.twitter.com/fEMIGMdlTQ

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వెన్నుచూపని వీరుడు, జనాదరణ పొందిన నాయకుడు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హామీల అమలు దిశగా పని చేయాలి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు హరీశ్​రావు ట్వీట్ చేశారు.

  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను.…

    — Harish Rao Thanneeru (@BRSHarish) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం - ఆరు గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందిచాలని కోరారు. రేవంత్ పరిపాలన ప్రజారంజకంగా కొనసాగాలని, ప్రజాసేవ చేసే దిశగా రేవంత్ భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర సాధన కోసం అమరలైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నేరవెర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలని కోరారు.

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం - లక్ష మందితో కిక్కిరిసిపోయిన ఎల్బీ స్టేడియం

నేడు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారా - తొలి సంతకం దేనిపై చేస్తారో?

Last Updated : Dec 7, 2023, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.